Advertisementt

టాలీవుడ్‌లో దీపావళి కళ ఏది..?

Thu 08th Nov 2018 05:58 PM
adhugo movie,disappoints,tollywood,diwali day,sarkar,no lights  టాలీవుడ్‌లో దీపావళి కళ ఏది..?
Tollywood Disappoints with Deepavali టాలీవుడ్‌లో దీపావళి కళ ఏది..?
Advertisement
Ads by CJ

ఈ దీపావళికి మన తెలుగులో పెద్దగా సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడే కాదు ఎప్పటినుండో దీపావళి పండగకి మనోళ్లు సినిమాలు రిలీజ్ చేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే దీపావళి అమావాస్య రోజున వస్తుంది కాబట్టి ఆ సెంటిమెంట్ తో రిలీజ్ చేయరు. కానీ తమిళనాడులో మాత్రం దీపావళికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగు లో కూడా విజయ్ నటించిన ‘సర్కార్’ సినిమా రిలీజ్ అయింది.

ఈసారి దసరాకు రిలీజ్ అయినా మన సినిమాల సందడి అంతా తడిచిపోయిన టపాకాయల వలే తుస్సుమంది. దసరాకు వచ్చిన ‘అరవింద సమేత’ కొన్ని కొన్ని ఏరియాస్ లో బండిని చాలా కష్టంగా లాక్కొస్తుంది. ఇక ‘సవ్యసాచి’ కూడా ముందే చీదేసిన జువ్వాయిలా తుస్సుమంది. నిన్న రిలీజ్ అయినా ‘అదుగో’ సినిమా పరిస్థితి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ‘సర్కార్’ కూడా సరిగ్గా ఎండని మతాబులా అక్కడక్కడ మెరవడమే కాని.. మొత్తంగా వెలుగులు నింపలేకపోయింది.

ఈసారి వచ్చిన సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎటువంటి వెలుగును ప్రసరించేలా కనిపించట్లేదు. దాంతో ఈ దీపావళి వెలుగు లేని దీపావళి గా మారింది మన ప్రొడ్యూసర్స్ కి. ఇక ఈ ఏడాదికి క్రిస్మస్ పండగ ఒకటే మిగిలింది. మరి అప్పుడైనా మనోళ్లు సత్తా చాటుతారేమో చూడాలి.

Tollywood Disappoints with Deepavali:

Adhugo Movie Disappoints Tollywood in Diwali Day

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ