తమిళనాట పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలేమైనా సరే అక్కడ ప్రేక్షకులకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అందుకే చాలామంది తమిళ దర్శకులు రాజకీయ నేపథ్యాలని బేస్ చేసుకుని సినిమాలు చేస్తారు. అందులోనూ తమిళ రాజకీయాలు ఎప్పటికప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత... నిన్నగాక మొన్న శశికళ, పళని స్వామి ఇలా తమిళనాడు రాజకీయాలన్నీ ఒక పెద్ద డ్రామా కంపెనీకి తీసిపోని రాజకీయాలే. అందుకే అక్కడ ప్రేక్షకులు కూడా సినిమాల్లో పొలిటికల్ డ్రామా ఉంటే... చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే తెలుగు హీరో విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న నోటా సినిమాని తెరకెక్కించాడు.
ఆ సినిమాలో అనుకోకుండా సీఎం కొడుకు సీఎం ఎలా అయ్యాడో... అతను రాజకీయాలను ఆకళింప చేసుకుని పొలిటికల్ సిస్టం ని ఎలా మార్చాడో అనేది చూపించాడు. ఆ సినిమా ని తమిళ ప్రేక్షకులే మెచ్చలేదు. ఇక తెలుగులో డబ్ అయిన నోటా సినిమా డిజాస్టర్ టాక్ తో థియేటర్స్ లో నడిచింది. ఇక తాజాగా మురుగదాస్ కూడా ఈ పాలిటిక్స్ ని బేస్ చేసుకుని విజయ్ హీరోగా సర్కార్ మూవీని తెరకెక్కించాడు. సర్కార్ సినిమాలో కేవలం తన ఓటు దుర్వినియోగం అవడంతో.. అతిపెద్ద కంపెనీ సీఈవో అయిన ఒక వ్యక్తి ఇండియాలో తన ఓటు కోసం పోరాడి మరి తన ఒక్కడికోసం ఎలక్షన్స్ ని మళ్ళీ పెట్టిస్తాడు. ఇక అంతా సినిమాటిక్ గా అనిపిస్తున్న పాలిటిక్స్ ని మురుగదాస్ ఈ సినిమాలో చూపించాడు. ఇక ఒక వ్యక్తి కోసం ఎలక్షన్స్ మల్లి పెట్టడం, రాజకీయనాయకుల రెచ్చగొడితే సీఎం మీదే పోటీ చెయ్యడం... ఇలా అంతా పొలిటికల్ గా సర్కార్ సినిమాని మురుగదాస్ తెరకెక్కించాడు.
అయితే ఈ సినిమాలో కథ బలంగా లేకపోవడం, స్క్రీన్ ప్లే మెచ్చేదిగా లేకపోవడం, మ్యూజిక్ తేడా కొట్టడం, అలాగే మురుగదాస్ మార్క్ డైరెక్షన్ లేకపోవడం వంటి నెగెటివ్ పాయింట్స్ తో మురుగదాస్ సర్కార్ మూవీ మొదటి రోజే తెలుగులో ప్లాప్ టాక్, తమిళనాట యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ ఏడాది తమిళంలో ఇద్దరు విజయ్ లు పొలిటికల్ బ్యాగ్రౌండ్ లో చేసిన సినిమాలు రెండు తుస్ మన్నాయి.