ఏ సీజన్‌లో అయినా మెగా కాంపౌండ్ హీరోల సినిమాల రిలీజ్ విషయంలో ఎక్కడ తమలో తమకి పోటీ రాకుండా చూసుకుంటారు. అలా వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ మధ్య వరుణ్ తేజ్ అండ్ సాయి ధరమ్ తేజ్ తమ సినిమాలతో పోటీ పడ్డారు. అది కూడా సాయి ధరమ్ తేజ్ ‘ఇంటెలిజెంట్’ తో శుక్రవారం వస్తే... ‘తొలిప్రేమ’తో వరుణ్ తేజ్ ఒక్క రోజు ఆలస్యంగా శనివారం వచ్చాడు. అనూహ్యంగా ఇదే పెద్ద హిట్ అయ్యింది. తేజు సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
అయితే మరోసారి వరుణ్ కు మెగా హీరోతో స్ట్రెయిట్ ఫైట్ తప్పడం లేదు. ఈసారి రామ్ చరణ్ తో పోటీకి దిగనున్నాడు వరుణ్ తేజ్. వీరిద్దరూ ఎప్పుడు ఇలా ఒకే సీజన్ లో తలపడలేదు. చరణ్ తో పోల్చుకుంటే వరుణ్ కి పెద్దగా మార్కెట్ లేకపోవచ్చు కానీ అండగా వెంకటేష్ తో పాటు దిల్ రాజు ఉన్నాడు. సో ఈ సినిమాకి చాలా హైప్ ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఎఫ్ 2’ సినిమాను సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలనీ దిల్ రాజు ప్లాన్. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘వినయ విధేయ రామ’ సంక్రాంతికి విడుదల చేస్తాం అని ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. సో అలా వీరిద్దరికి పోటీ తప్పలేదు.
సంక్రాంతి సీజన్ కాబట్టి వసూల్ పరంగా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదని నమ్మకంతో ఉన్నారు అభిమానులు. పైగా రెండు డిఫరెంట్ జోనర్స్. రామ్ చరణ్ - బోయపాటి మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాగా అనిల్ రూపొందిస్తున్న ‘ఎఫ్2’ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ మూవీ అని ఇన్ సైడ్ టాక్. సో జోనర్స్ కూడా ఒకదానికి ఒక్కటి సంబంధం లేకపోవడంతో పోటీ విషయంలో ఆందోళన అవసరం లేదు.