కొత్తతరం ఆలోచనలు రూపం అయిన సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లోకి మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ నందితశ్వేత అడుగు పెట్టింది. ఈ బ్యానర్ నుండి వస్తున్న తొలి చిత్రంలో లీడ్ పాత్రకు ప్రాణం పోయబోతుంది. ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన నందిత తమిళంలో స్ట్రాంగ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సినిమా హాల్ ఎంటర్‌టైన్మెంట్ లో ప్రారంభం అవుతున్న ఈ మూవీ కథ తనను చాలా ఇంప్రెస్ చేసిందని ట్విట్టర్ ద్వారా తన ఆనందం తెలియజేసింది. త్వరలో ప్రారంభం అయ్యే ఈ మూవీకి సంగీతం సురేష్ బొబ్బిలి, దర్శకుడు చిన్నిక్రిష్ణ.
ఈ మూవీ ప్రారంభం రోజునే కంటెంట్ కి రిలేట్ అయ్యే ఒక టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. నందిత శ్వేత లీడ్ రోల్ ప్లే చేసే ఈమూవీలో మిగిలిన నటీ నటులను త్వరలోనే ప్రకటిస్తారు. సినిమాపై ఉండే ప్యాషన్ కి రూపం అయిన సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ కి నిర్మాతలు అహితేజ బెల్లంకొండ, సురేష్ వర్మ అల్లూరి.