Advertisementt

నేనే పార్వతి అంటే.. కాదంటున్న వర్మ!

Tue 06th Nov 2018 12:54 PM
lakshmis ntr,confusion,rgv,roopali,lakshmi parvathi  నేనే పార్వతి అంటే.. కాదంటున్న వర్మ!
Confusion on Varma’s Lakshmi Role నేనే పార్వతి అంటే.. కాదంటున్న వర్మ!
Advertisement
Ads by CJ

ఒకవైపు బాలయ్య-క్రిష్‌ల కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండు భాగాలుగా ఉండనుంది. ఇందులో ఎన్టీఆర్‌ జీవితంలోని చివరి రోజులు, లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్‌ జీవితంలోకి ఎంటర్‌ అయిన తరువాత జరిగిన సంఘటనలకీ పెద్దగా ప్రాధాన్యం ఉండబోదని అంటున్నారు. అయితే బాలయ్య బాకీని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ పూరించనున్నాడు. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్‌ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను తాను తన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంలో చూపిస్తానని వర్మ తెలిపాడు. కానీ చాలా కాలం మౌనంగా ఉండటంతో ఇక ఈ చిత్రం కూడా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డిల ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ మాదిరిగా మూలన పడుతుందా? అనే అనుమానాలు వచ్చాయి. 

కానీ వర్మ మాత్రం దీనిని వదలలేదు. తిరుపతి వేదికగా తన చిత్రాన్ని అనౌన్స్‌ చేయడమే కాదు.. ఇందులో చంద్రబాబునాయుడు పాత్రధారి కోసం ఓ హోటల్‌ సర్వర్‌ని కూడా ఎంచుకున్నాడు. ఆ వ్యక్తిని సూచించిన వ్యక్తికి లక్షరూపాయల నజరానా కూడా ఇచ్చాడు. మరోవైపు ఎన్టీఆర్‌ పాత్ర కోసం కూడా వేటని సాగిస్తున్నాడు. ఇక తాజాగా అప్‌డేట్‌ ప్రకారం ఆయన ఇందులోని కీలకమైన లక్ష్మీపార్వతి పాత్ర కోసం ముంబై మోడల్‌ రూపాలీ సూరిని ఎంపిక చేశాడట. ‘డ్యాడ్‌.. హోల్డ్‌ మై హ్యాండ్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలో ఈమెని, ఈమె నటనను, లక్ష్మీపార్వతిలోని పోలికలను గమనించి ఈయన ఈ పాత్రకి ఆమెని ఎంపిక చేశాడట. ఇక ఈ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్‌ బయోపిక్‌ విడుదల సందర్భంలోనే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. 

ఈ విషయాన్ని దాదాపు రూపాలీ సూరి కూడా నిజమేనని ఒప్పుకుంది. ఈమె తాజాగా అమెజాన్‌లో ప్రసారం కానున్న ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ 2’ వెబ్‌సిరిస్‌లో కూడా నటిస్తోంది. ఈమె మాట్లాడుతూ, అవును.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో నేను నటిస్తున్నాను. అందరికీ త్వరలో వివరాలు తెలుస్తాయి. ఇప్పటికి నేను చెప్పగలిగింది ఇది ఒక్కటే. ఈ సినిమాలో భాగం అవుతున్నందుకు చాలా ఎగ్జయిట్‌ అవుతున్నాను. ఇదొక అద్భుతమైన కథ, చాలా పెద్ద సినిమా అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె చెప్పేది నిజం కాదంటూ వర్మ మరో బాంబ్ వెంటనే పేల్చాడు. ఆమె అసలు ఈ బయోపిక్‌లోనే నటించడం లేదని, ఆ వార్తలను నమ్మవద్దని.. ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

Confusion on Varma’s Lakshmi Role:

Lakshmis NTR Movie Creates Sensation in Social Media with Lakshmi Parvathi Role

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ