Advertisementt

మొన‌గాడైన ప్రయత్నం చేస్తున్నారు..!!

Mon 05th Nov 2018 11:27 PM
monagadevaru,monagadevaru movie launch,monagadevaru movie opening,monagadevaru telugu movie  మొన‌గాడైన ప్రయత్నం చేస్తున్నారు..!!
Monagadevaru Movie Launched మొన‌గాడైన ప్రయత్నం చేస్తున్నారు..!!
Advertisement
Ads by CJ

మెగా ఆర్ట్స్ ప‌తాకంపై వాడ‌ప‌ల్లి జ‌గ‌న్నాథం స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ వాడ‌ప‌ల్లి  నిర్మిస్తోన్న చిత్రం ‘మొన‌గాడెవ‌రు’.  హు ఈజ్ నెంబ‌ర్ వ‌న్ అనేది ట్యాగ్ లైన్‌. రాజ్ వాడ‌ప‌ల్లి, వంశీకృష్ణ‌, ప్రియా అగ‌స్టి, కావ్య కీర్తి బండారిలు హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి కుమార్ రాజేంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం సోమ‌వారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ‘మా’ అధ్య‌క్షుడు శివాజీరాజా తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఛాన్  చేశారు. ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిర్మాత రామ స‌త్య‌నారాయ‌ణ టైటిల్  లోగో లాంచ్ చేశారు. 

అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత రాజ్ వాడ‌ప‌ల్లి మాట్లాడుతూ.. ‘‘సినిమాలో సినిమాగా ‘మొన‌గాడెవ‌రు’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సినిమాలో వ‌చ్చిన 50%  లాభాల‌ను సినిమా ప‌రిశ్ర‌మ‌లోని పేద క‌ళాకారుల‌కు ఇవ్వ‌నున్నాం. మా తొలి ప్ర‌య‌త్నాన్ని ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కుమార్ రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘మా సినిమాలో వినోదంతో పాటు సామాజిక అంశాలు కూడా మెండుగా ఉన్నాయి. సినిమా రంగంలో నిల‌దొక్కుకోవాల‌ని వ‌చ్చిన న‌లుగురు యువ‌తీ యువ‌కులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు?  చివ‌రికి వారి కోరిక నెర‌వేరిందా? లేదా అన్న‌ది సినిమా క‌థాంశం. మ‌రో వైపు చిత్తూరు నాగ‌య్య ద‌గ్గ‌ర నుంచి మెగాస్టార్ వ‌ర‌కు సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవ‌డానికి ఎలాంటి స్ట్ర‌గుల్స్ ప‌డ్డారు అన్న‌ది అంద‌రి హీరోల బ‌యోపిక్ లాగా చూపిస్తున్నాం. ఇదొక వినూత్న ప్ర‌యోగం అని చెప్ప‌వ‌చ్చు’’ అన్నారు.

బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. ‘‘సినిమాలో సినిమాగా  ‘మొన‌గాడెవ‌రు’ వ‌స్తోంది. ఈ సినిమాలో వ‌చ్చిన 50%లాభాల‌ను ప‌రిశ్ర‌మ‌కు చెందిన పేద క‌ళాకారుల‌కు ఇవ్వాల‌నుకోవ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం’’ అన్నారు.

హీరోయిన్ ప్రియా అగ‌స్టి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్నా. ఒక మంచి సినిమాలో అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొని అవ‌కాశం ప‌ట్ల ఆనందాన్నివ్య‌క్తం చేశారు. 

ఇందులో బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, హేమ‌సుంద‌ర్‌, శివ శంక‌ర్ మాస్ట‌ర్‌, బిత్తిరి స‌త్తి, కృష్ణ‌వేణి, రాగిణి, ఎన్టీఆర్ డూప్ గా భాస్క‌ర్, చిరంజీవి డూప్ గా ధ‌ర్మ‌తేజ‌, శోభ‌న్ బాబు డూప్ గా వెంక‌టేశ్వ‌ర‌రావు, బాల‌కృష్ణ డూప్ గా రామ‌కృష్ణ న‌టిస్తున్నారు. 

Monagadevaru Movie Launched:

Monagadevaru Movie Launch Event Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ