Advertisementt

ఈ సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి

Mon 05th Nov 2018 09:13 PM
law,law trailer launch,kamal kamaraju,pooja ramachandra,mouryani,law movie  ఈ సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి
LAW Trailer Released ఈ సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి
Advertisement
Ads by CJ

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే నే హీరో.. ‘‘లా’’ ట్రైలర్ లాంచ్ వేడుకలో కమల్ కామరాజ్

కాన్సెప్ట్ ఓరియెంటడ్ కథలు ఆకట్టుకుంటున్న ట్రెండ్‌లో ‘లా’ మూవీ ఆ ట్రెండ్‌ని కొనసాగిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్. కమల్ కామరాజ్, మౌర్యాణి, పూజా రామచంద్రన్ లీడ్ రోల్స్  ప్లే చేసిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. 

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘కమల్ నాకు ఎప్పటినుండో స్నేహితుడు. సినిమాపై అతనికుండే అభిరుచి నాకు బాగా తెలుసు. ట్రైలర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ‘లా ’ అంటే కోర్ట్ రూం డ్రామా అనుకున్నాను. కానీ ట్రైలర్ నన్ను సర్ ప్రైజ్ చేసింది. కాప్ లుక్స్ లో కమల్ చాలా బాగున్నాడు. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరోయిన్ మౌర్యాణి మాట్లాడుతూ.. ‘‘నేను చాలా ఇష్టపడి చేసిన మూవీ అలాగే చాలా కష్టపడి చేసిన మూవీ కూడా. ట్రైలర్ నన్ను ఒక ఆడియన్ గా ఇంప్రెస్ చేసింది. నాకు ఇలాంటి కథలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు గగన్‌కి థ్యాంక్స్. స్టోరీ చెప్పినప్పుడు బాగుంది అనుకున్నాను. కానీ నాకు ఎలాంటి అంచనాలు లేవు. కానీ సినిమా నా అంచనాలను మించి ఉంది.  కమల్ అందించిన సహాకారం మర్చిపోలేను, పూజా మంచి ఫ్రెండ్. నాకు తనతో వర్క్ చేయడం నా నటనకు చాలా హెల్ప్ అయ్యింది’’ అన్నారు.

పూజా రామచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘ఢిపరెంట్ క్యారెక్టర్స్ చేయడం నాకు చాలా ఇష్టం. నాకు ఇలాంటి రోల్ ఇచ్చిన దర్శకుడు గగన్ కి చాలా థ్యాంక్స్. చేసే పాత్రలు ఛాలెజింగ్ గా ఉంటే నాకు ఇష్టం. అలాంటి రోల్ లో మీకు ఇందులో కనిపిస్తాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. టాలీవుడ్ నాకు చాలా మంచి మెమరీస్ ని ఇచ్చింది. నాకు ఎలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లు లేవు. కమల్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది..’’ అన్నారు. 

దర్శకుడు గగన్ గోపాల్ ముల్కా మాట్లాడుతూ.. ‘‘ హీరో కమల్ అందించిన సహాకారం మరిచిపోలేను. హీరోగానే కాదు కథ బాగా రావడానికి నా వెనక ఒక బలంగా మారి నడిపించారు. హీరోయిన్స్, మౌర్యాణి, పూజా గారు అందించిన సహాకారం తో 30 డేస్ లో కంప్లీట్ చేయగలిగాం. ఇది కంప్లీట్ విజయవాడలో రూపొందించిన మూవీ, సాంగ్స్ కూడా అక్కడే చేసాం. నిర్మాత రమేష్ గారు ఎప్పుడూ కథ గురించే ఆలోచించేవారు, ఖర్చు కోసం ఎక్కడా ఆలోచించలేదు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి బాగోపోతే వందమందికి చెప్పండి కానీ దయచేసి సినిమాని చూడండి’’ అన్నారు.

హీరో కమల్ కామరాజ్ మాట్లాడుతూ.. ‘‘ఏదైనా పండుగ చేసుకునే ముందు ఊరేగింపుతో మొదలు పెడతాం. ఇప్పుడు మా ట్రైలర్ తో మేము సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడం మొదలు పెట్టాం.. ఇకపై అంతా బాగుంటుందని నమ్ముతున్నాను. హీరోగా మళ్ళీ రీ లాంచ్ అంటున్నారు అవేమీ నేను పెద్దగా నమ్మను. ఈ సినిమాలో మొదటి హీరో స్ర్కీన్‌ప్లే. అదే మమ్మల్ని సినిమా చేసేందుకు మందుకు తీసుకొచ్చింది. డైరెక్టర్‌గారు ఇలాంటి స్ర్కీన్‌ప్లే లు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను. తర్వాత పూజ, మౌర్యాణి పాత్రలు ఈ సినిమా కథను డ్రైవ్ చేస్తాయి. ప్రతి ఒక్కరు ‘లా’ ని ఫాలో చేయకపోవడం  హీరోయిజం అనుకుంటాం. బేసిక్ కామన్ సెన్స్ వాడితే అందరూ ‘లా’ ని ఫాలో అయినట్లే. ఈ రోజు వచ్చిన ట్రెండ్ ఆఫ్ మూవీస్‌లో చాలా మార్పులు చూస్తున్నాం. ఇది ఎక్స్ ట్రీమ్ థ్రిల్లర్ గా మీ ముందుకు వస్తుంది. ప్రమోషన్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాను’’ అన్నారు.

నవంబర్ రెండో వారంలో విడుదలకు సిద్దం అవుతున్న ‘లా’ చిత్రంలో  పూజా రామచంద్రన్, మంజుభార్గవి, ఛత్రపతి శేఖర్, రవి మల్లాడి కీలక పాత్రలు పోషించారు.

LAW Trailer Released:

LAW Trailer Launch Event Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ