రాజమౌళి లాంటి దర్శకుడు ఏళ్ళ తరబడి సినిమా చేసినా.. ఆ సినిమా రేంజ్ దేశం ఎల్లలు దాటే రేంజ్. అందుకే అలాంటి దర్శకులు సినిమాలు స్లోగా తీసినా ఆ సినిమాల కుండే క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఇక సౌత్ లో భారీ బడ్జెట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన దర్శకుడు శంకర్. శంకర్ కూడా తన సినిమాలను చెక్కుతూ చెక్కుతూ ఏళ్ళ తరబడి సినిమాలు చేస్తుంటాడు. అలా చెక్కి చెక్కి ఆ సినిమాకి ఊహకందని బడ్జెట్ పెట్టిస్తుంటాడు. శంకర్ తో పనిచేసే నిర్మాతలు కూడా శంకర్ పెట్టె బడ్జెట్ తో సినిమాకి క్రేజొచ్చేస్తుంది.. ఎలాగూ అంచనాలు హై లో ఉంటాయి.. తమకి లాభాలే కానీ.. నష్టాలూ మాత్రం రావని చెబుతుంటారు. తాజాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 2.ఓ సినిమా ఏళ్ల తరబడి సెట్స్ మీదుండడమే కాదు.. ఎవరు ఊహించని విధంగా 600 కోట్ల బడ్జెట్ ఆ సినిమాకి ఎక్కింది.
మరి ముందు 400 నుండి చివరికి 600 కోట్ల బడ్జెట్ ఎక్కిందంటేనే... ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఆ సినిమాకి 600 కోట్ల బడ్జెట్ ఎక్కడానికి కారణమేమిటో ఇప్పుడు బయటికొస్తున్న నిజాలతో నోరెళ్లబెట్టాల్సి వస్తుంది. శంకర్ గత సినిమాల ప్లాప్ తో ఈ సినిమా విషయంలో చాలా అతి జాగ్రత్తలు తీసుకున్నాడట. అందుకే 2.ఓ కథను మూడుసార్లు మార్చాడనే టాక్ వినబడుతుంది. కథ ఎప్పటికప్పుడు మార్చడంతో... రీషూట్ల మీద రీషూట్లు చేసుకుంటూ వెళ్లాల్సివచ్చిందట. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన ఏఆర్ రెహమాన్ కూడా మూడు సార్లు రీరికార్డింగ్ చెయ్యాల్సివచ్చిందట.
అలా అయితే ఒక సన్నివేశం పూర్తయి... ఎడిటింగ్ కూడా అయి, సీజీ కూడా అయ్యాక దానికి రీ రికార్డింగ్ చేసిన తరువాత మళ్ళీ ఆ ప్లేస్ లోకి కొత్త సన్నివేశం వచ్చిందంటే.... శంకర్ ఆ సన్నివేశం కొత్తగా రావడానికి ఎంత కష్టపడ్డాడో.. ఇంకా ఆ సీన్ కోసం ఎంత లేట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. మరి కథను మూడుసార్లు మార్చి.. రీ షూట్స్ చేసి మరీ సినిమాని తెరకెక్కించాడంటే... ఆ మాత్రం ఖర్చు అవుతుందిలే. కథ విషయంలో శంకర్ ఎప్పటికపుడు అప్ డేట్ అవడంతోనే ఇన్ని రీ షూట్స్ జరిగాయని... ఇక కథ మారడంతో.. రీ రికార్డింగ్ కూడా మార్చి మార్చి చెయ్యడంతో ఇలా అనుకోని బడ్జెట్ 2.ఓ కి అయ్యిందట. మరి వీఎఫెక్స్ విషయంలో కూడా సగం పూర్తయ్యాక మళ్ళీ చేయించాల్సి రావడం... ఇలా ఖర్చు.. లైకా వారికి తలకు మించిన భారం అయ్యిందన్నమాట.