Advertisementt

2.O గురించి శంకర్ చెప్పిన విశేషాలివే..!!

Mon 05th Nov 2018 05:40 PM
director shankar,2.0 movie,trailer,launch  2.O గురించి శంకర్ చెప్పిన విశేషాలివే..!!
Director Shankar Speech at 2.0 Trailer Launch 2.O గురించి శంకర్ చెప్పిన విశేషాలివే..!!
Advertisement
Ads by CJ

'ఇలా జరిగితే ఎలా ఉంటుంది' అనే ఊహే ఈ కథ. ఇది పూర్తి స్థాయి యాక్షన్‌ థ్రిల్లింగ్‌ ఎంటర్టైన్‌మెంట్‌. సినిమా అనేదాన్ని కూడా దాటి... త్రీడీ, 4డీ అనే కొత్త అనుభవం ఉంటుంది. సుభాస్కరన్‌ లేకపోతే ఈ సినిమా లేదు. ఇండియన్‌ సినిమాను ఇంత బడ్జెట్‌ తో ఎవరూ నిర్మించరు. కేవలం సినిమా మీద ప్యాషన్‌తోనే ఆయన ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాకు చాలా గొప్ప బలం రజనీకాంత్‌గారు. ఆయన ఏం చేసినా, అట్రాక్టివ్‌గా, వ్యత్యాసంగా, స్టైల్‌గా, మాస్‌గా ఉంది. ఇన్నేళ్లుగా ఆయన నటించినప్పటికీ, ఇప్పటికీ ఆయన అభినయం చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ సినిమా ప్రారంభించినప్పుడు రజనీగార్‌కి కాస్త అనారోగ్యంగా ఉంది. ఢిల్లీలో యాక్షన్‌ డైరక్టర్లు, వీఎఫ్‌ ఎక్స్‌ డైరెక్టర్లు, అక్షయ్‌ కుమార్‌, చాలా మంది కార్పెంటర్లు, జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. దాదాపు ఆరు నెలల ముందే ప్లాన్‌ చేసుకున్న షెడ్యూల్‌ అది. దాదాపు 500-1000 మంది అక్కడ ఉన్నారు. ఆ సమయంలో రజనీకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ 47 డిగ్రీల ఎండ, 12 కిలోల బరువు వేసుకుని క్లైమాక్స్‌ చేశారు. ఒక రోజైతే ఆయనకు దెబ్బ తగిలింది కూడా నాకు తెలియదు. ఎవరో వచ్చి చెప్పారు. ఆయన్ని కూర్చోపెట్టి.. ప్యాంట్‌ కాస్త పైకి తీసి చూస్తే రెండు ఇంచ్‌లు తెగిన విషయం తెలిసింది. ఆయన్ని బతిమలాడి హాస్పిటల్‌కి పంపాం. ఇలాంటి డెడికేషన్‌ వల్లనే ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారు. అక్షయ్‌గారు ఈ సినిమాకు పడ్డంత ఎప్పుడూ కష్టపడి ఉండరు. థిక్‌ డ్రస్‌, విగ్‌, కళ్లకు లెన్స్‌, ప్రోస్తటిక్‌ మేకప్‌.. అంత కష్టపడి చేశారు. ఆరు నెలలకు ముందు నుంచే రెహ్మాన్‌గారు మరలా మరలా మ్యూజిక్‌ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అంతా పాటల్లాగానే ఉన్నాయి.

ఈ సినిమా కోసం నాతోపాటు కుక్కల్లాగా, దెయ్యాల్లాగా కష్టపడింది మా అసోసియేట్‌ డైరెక్టర్‌ పప్పు. తన కష్టం చాలా గొప్పది. శరత్‌, ప్రశాంత్‌, నీలేష్‌, కార్తిక్‌, గోవర్ధన్‌.. వీళ్లందరూ నాతో పాటు నాలుగేళ్లు కష్టపడ్డారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ ముత్తురాజ్‌గారు ప్రీ ప్రొడక్షన్‌లో చాలా ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టారు. సినిమా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌, మరీ ముఖ్యంగా వీఎఫ్‌ ఎక్స్‌ లో ఆయన భాగం ఎక్కువ. వీఎఫ్‌ఎక్స్‌ శ్రీనివాసన్‌ కథ నుంచి ఫస్ట్‌ కాపీ వరకు కాన్‌స్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆంటోనీ, యానిమేషన్‌ని, తర్వాత షూట్‌ని, ఇప్పుడు సీజీని... మొత్తం మూడు రకాలుగా ఎడిట్‌ చేశారు. నీరవ్‌ షా, జయమోహన్‌, ఎమీ, కరుణా మూర్తి... ఇలా ప్రతి ఒక్కరూ ఎంతెంతో కష్టపడ్డారు. అసాధారణమైన కృషి చేశారు. మీడియాకు నా విన్నపం... ఇలాంటి సినిమాలను సపోర్ట్‌ చేయండి. వేలమంది టన్నుల కొద్దీ కష్టపడ్డారు. మీడియా సపోర్ట్‌ చేస్తే, మన ఊరిలోనూ ఇలాంటి సినిమాలను చేయగలం అని ప్రపంచానికి చెప్పగలం. ఇలా చాలా సినిమాలు వస్తాయి’’ అని అన్నారు. 

4డీ గురించి దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథను రాసేటప్పుడు ఎలాగైనా ఇది త్రీడీలో వస్తేనే బావుంటుందని అనుకున్నా. సౌండ్‌ మాత్రం 4 డీలో ఉండాలని అనుకున్నా. నా ఎన్నో ఏళ్ల కల అది. మామూలుగా మనం సినిమా చూసేటప్పుడు చుట్టుపక్కల నుంచి, పై నుంచి స్పీకర్ల ద్వారా శబ్దాలను వినొచ్చు. కానీ కాళ్ల కింద కూడా స్పీకర్లు ఉంటే... నేల మీద జరిగే అంశాలకు కూడా సౌండ్‌ కల్పిస్తే బావుంటుందని ఆశించాను. రసూల్‌ పూకుట్టి కూడా దానికి ఎంతగానో సహకరించారు. కేవలం 4డీ సౌండ్‌ ని అందించడం మాత్రమే కాదు.. 4,5 స్టూడియోలో ఉన్న అన్నీ సిస్టమ్స్‌ ని ఆయన స్టూడియోకి తెచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత మేం పడ్డ కష్టం అర్థమవుతుంది. ఎగ్జిబిటర్లకు నేను రిక్వస్ట్‌ చేసేది ఒక్కటే.. దయచేసి త్రీడీ థియేటర్లను ఎక్కువ చేయండి. ఈ సినిమా ఫుల్‌ ఎఫెక్ట్‌ తెలియాలంటే 4డీ సౌండ్‌ సిస్టమ్‌లోనూ, త్రీడీలోనూ చూస్తేనే అందుతుంది’’ అని అన్నారు.

Director Shankar Speech at 2.0 Trailer Launch:

2.O Trailer Launch Highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ