Advertisementt

‘సవ్యసాచి’తో జాగ్రత్త పడుతున్నారు

Sun 04th Nov 2018 05:40 PM
mythri movie makers,savyasachi,alert,naga chaitanya,amar akbar antony  ‘సవ్యసాచి’తో జాగ్రత్త పడుతున్నారు
Mythri Movie Makers Alert with Savyasachi Result ‘సవ్యసాచి’తో జాగ్రత్త పడుతున్నారు
Advertisement
Ads by CJ

తాజాగా రిలీజ్ అయిన ‘సవ్యసాచి’ మూవీ ఓవరాల్‌గా ప్లాప్ టాక్ తెచ్చుకుని చైతూకు హ్యాట్రిక్ పూర్తి చేయించింది. అంతకముందు ‘యుద్ధం శరణం’, ‘శైలజారెడ్డి అల్లుడు’ వచ్చి డిజాస్టర్ గా నిలవడంతో మూడో ప్లేస్‌లో  ‘సవ్యసాచి’ చేరి హ్యాట్రిక్ ప్లాప్‌గా నిలిచింది. అయితే ఇంకో విషయం ఏంటంటే.. ‘సవ్యసాచి’ నిర్మించిన మైత్రీ మూవీస్ వారికి ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేదు. ఈ సినిమాతో వాళ్లు కూడా బోణి కొట్టారు.

మైత్రీ బ్యానర్‌లో ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో వీరి బ్యానర్ లో ఈనెలలో రాబోతోన్న ‘అమర్ అక్బర్ ఆంటొనీ’ మీద సైతం అనుమానాలు ఉన్నాయి ప్రేక్షకుల్లో. రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో కాబట్టి ప్రేక్షకుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ కు అంత కన్నా ఆనందం ఏమి ఉండదు.

మైత్రీ మూవీ వారు ఈసినిమాలే కాకుండా మరికొన్ని సినిమాలను లైన్ పెట్టారు. రవితేజ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ ఓ సినిమా రాబోతుంది. త్వరలోనే ఆ డీటెయిల్స్ చెప్పనున్నారు. సాయి ధరమ్ తేజ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో ‘చిత్రలహరి’ అనే సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈసినిమా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వచ్చే ఏడాది లోపు మైత్రీ నుంచి సుమారు ఏడు వరకు సినిమాలు ఉండే అవకాశం ఉంది. ‘సవ్యసాచి’ ఫలితం‌తో మైత్రీ వారు కొంచం జాగ్రత్త పడ్డారు అని తెలుస్తుంది. చైతూ కూడా ఆచి తూచి అడుగులు వేస్తే బెటర్ అని లేకపోతే తన కెరీర్ కు ఎండ్ కార్డు పడడం కాయం అనే నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Mythri Movie Makers Alert with Savyasachi Result:

Mythri Movie Makers Takes Sensational Decision on their future movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ