'అర్జున్‌రెడ్డి' తర్వాత అంతే బోల్డ్‌గా వచ్చి ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా యూత్‌ని ఎంతో ఆకట్టుకున్న చిత్రం 'ఆర్‌ఎక్స్ 100'. అతి తక్కువ బడ్జెట్‌తో రాంగోపాల్‌వర్మ శిష్యుడు అజయ్‌భూపతి తీసిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాస్‌మహారాజా రవితేజ తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇక విషయానికి వస్తే ఇందులో హీరోగా నటించిన కార్తికేయ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించాడు.
ఈ సందర్భంగా పలువురు హీరోల అభిమానులు తమ హీరోలను చూస్తే ఏమనిపిస్తోంది? అని అడిగితే అందరినీ ఒక పట్టాన ఆకాశానికి లేపాడు. రామ్‌చరణ్ గురించి మాట్లాడుతూ, 'చరణ్ చాలా గొప్ప డ్యాన్సర్. మంచి నటుడు. చిరంజీవి కొడుకుననే గర్వం ఆయనలో అసలు కనిపించదు. ప్రతి సన్నివేశం బాగా రావడానికి ఆయన చాలా కష్టపడుతూ ఉంటాడు. చిరంజీవి కొడుకైన ఆయనే అంతలా కష్టపడుతుంటే మనం ఇంకెంత కష్టపడాలి? అని అనుకుంటూ ఉంటాను. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ఏదైనా సాధ్యమే. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎదగవచ్చు. అనే ఆశాభవాన్ని విజయ్ నుంచి నేర్చుకోవచ్చు. ఆయనలో అభిమానులకు నచ్చింది కూడా అదే.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ముందుగా ప్రభాస్‌ని చూడగానే ఏం ఉన్నాడ్రా బాబూ..! అనిపిస్తుంది. ఆయన పర్సనాలిటీ అలాంటిది. ఆయన నుంచి నేర్చుకోవాల్సంది అంకితభావం. 'బాహుబలి' కోసం అన్నేళ్లు కేటాయించడం, ఆ సినిమాపైనే దృష్టి పెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన అంతటి పెద్ద హీరో అయినా కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకు వెళ్తుంటాడు. అంతలా ఎదిగి, ఒదిగి ఉండటమనేది ప్రభాస్‌లో నాకు నచ్చిన విషయం. ఇక 'పోకిరి' చిత్రం ముందు వరకు నేను రమ్యకృష్ణ అభిమానిని. 'పోకిరి' తర్వాత ఇలియానా అంటే పిచ్చి ఏర్పడింది. ఆ పిచ్చి ఇప్పటికీ అలానే ఉంది. ఇక పాయల్ రాజ్‌పుత్ గొప్ప కోఆర్టిస్ట్, ఎంతో బాగా నటిస్తుంది. ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.