Advertisementt

అల్లు శిరీష్ చిత్రం విడుదల ఎప్పుడంటే..?

Sat 03rd Nov 2018 10:11 PM
allu sirish,abcd,release date,feb 8,2015  అల్లు శిరీష్ చిత్రం విడుదల ఎప్పుడంటే..?
Allu Sirish ABCD Release Date Fixed అల్లు శిరీష్ చిత్రం విడుదల ఎప్పుడంటే..?
Advertisement
Ads by CJ

చివరి షెడ్యూల్ లో అల్లు శిరీష్ 'ఏబీసీడీ'   చిత్రం..... ఫిబ్రవరి 8న  గ్రాండ్ రిలీజ్

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా, కోటా శ్రీనివాసరావ్, శుభలేక సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇండియాలో చివరి షెడ్యూల్ చేసేందుకు ప్లాన్ చేశారు. అమెరికాలో జరిగే షెడ్యూల్ తో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ 15 నాటికి షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా....

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. మాస్టర్ భరత్, అల్లు శిరీష్ స్నేహితుడిగా నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథ, కథనం, మాటలు ఉంటాయి. అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేమ్ రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు రాజా,  కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్ రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథను తీర్చిదిద్దారు. ఇండియాలో చివరి షెడ్యూల్ ప్లాన్ చేశాం. అమెరికాలో జరిగే షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. డిసెంబర్ 15 నాటికి చిత్ర షూటింగ్ పూర్తవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే ఈ చిత్రాన్ని 2019 ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, భరత్, రాజా, కోటా శ్రీనివాసరావ్, శుభలేఖ సుధాకర్ తదితరులు

సాంకేతిక వర్గం మ్యూజిక్ డైరెక్టర్ - జుధా సాంధీ,  కో ప్రొడ్యూసర్ - ధీరజ్ మొగిలినేని,  బ్యానర్స్ - మధుర ఎంటర్ టైన్ మెంట్, బిగ్ బెన్ సినిమాస్, పిఆర్ఓ - ఏలూరు శ్రీను, నిర్మాతలు - మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని, దర్శకుడు - సంజీవ్ రెడ్డి

Allu Sirish ABCD Release Date Fixed:

ABCD Movie Shooting Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ