Advertisementt

RRR అఫీషియల్ డేట్ వచ్చేసింది..!!

Sat 03rd Nov 2018 02:21 PM
rajamouli,ram charan,ntr,multistarrer,rrr movie,launch date  RRR అఫీషియల్ డేట్ వచ్చేసింది..!!
RRR Film's Launch Date out RRR అఫీషియల్ డేట్ వచ్చేసింది..!!
Advertisement
Ads by CJ

రాజమౌళి - రామ్ చరణ్ - రామారావు RRR మల్టీస్టారర్ సినిమా హడావిడి స్టార్ట్ అయ్యింది. మార్చిలోనే డివివి దానయ్య నిర్మాతగా... RRR అంటూ మోషన్ పోస్టర్ తో హడావిడి చేసి సైలెంట్ అయిన రాజమౌళి బ్యాచ్ ఇప్పుడు ఈనెల మొదటి వారంలో సినిమాని ప్రారంభించి మరింత హడావిడి చెయ్యడానికి రెడీ అవుతుంది. గత ఆరు నెలలుగా ఈ RRR పై రాని న్యూస్ అంటూ లేదు. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్న పదమే సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈ సినిమా మొదలవుతుంది అంటే అభిమానులు ఆగుతారా... కేవలం అభిమానులే కాదు రాజమౌళి చెయ్యబోయే సినిమా కోసం యావత్ దేశమే ఎదురు చూస్తుంది. మరి రాజమౌళికున్న క్రేజ్ అలాంటిది. 

ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని స్టార్ హీరోలైన్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎంతగా ఎదురు చూశారో తెలియదు కానీ.... వారి అభిమానులు మాత్రం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి ఆ శుభ ముహూర్తానికి డేట్ వచ్చేసింది. దానయ్య నిర్మాణంలో భారీప్రాజెక్ట్ గా తెరకెక్కబోయే RRR రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ ల బిగ్ మల్టీస్టారర్ రేపు 11 వ తారీఖున 11 గంటలకు మొదలవ్వబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ చిన్నపాటి టీజర్ తో తెలియజేశారు. ఆ టీజర్ లో 11 వ నెల 11 వ తారీఖు ఉదయం 11 గంటలకు RRR సినిమా మొదలవ్వబోతుందని చెప్పడమే కాదు.. ఆ 11.11.11 ని RRR గా మార్చారు చూశారూ అద్భుతః అన్న రీతిలో ఉంది. అసలే సెన్సేషనల్ డైరెక్టర్.. అందునా ఇద్దరు స్టార్ హీరోలు...మరి సినిమా మొదలవుతుంది అంటే దాని సందడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకోవడానికి రెడీ అయిపోతున్నారు.

RRR Film's Launch Date out:

Official Teaser: RRR Launch Date  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ