ప్రతి సంవత్సరం సంక్రాంతికి బడా స్టార్స్ అంతా తమ తమ సినిమాల్తో గట్టిగా పోటీ పడుతుంటారు. చాలామంది హీరోలు సంక్రాంతికి తమ అభిమానులను హుషారెత్తిస్తారు. ఎప్పుడూ టాలీవుడ్ లో సంక్రాంతి పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. కేవలం స్టార్ హీరోలు మాత్రమే ఈ సంక్రాంతికి పోటీ పడుతుంటారు. చిన్న హీరోలెవరైనా ఆ పోటీలోకొస్తే గాల్లో కొట్టుకుపోవడమే. ఇక 2019 టాలీవుడ్ సంక్రాతి బరిలో రామ్ చరణ్ - బోయపాటిల మాస్ ఎంటర్‌టైనర్‌తో పాటుగా... క్రిష్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ కూడా విడుదలవుతుంది. దీంతో మెగా, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తితో ఉన్నారు
ఇక కోలీవుడ్ లోను ఇద్దరు బడా హీరోలు 2019 సంక్రాంతికి తమ తమ సినిమాల్తో అభిమానులను అలరించనున్నారు. తమిళనాటే కాదు సౌత్ మొత్తం అభిమానులున్న రజినీకాంత్, అంతే అభిమాన గణం ఉన్న హీరో అజిత్ తమ తమ చిత్రాలతో సంక్రాంతి బరిలో నిలవబోతున్నారు. రజినీకాంత్ - కార్తీక్ సుబ్బరాజు కాంబోలో తెరకెక్కుతున్న ‘పెట్టా’ చిత్రం జనవరి 11 న విడుదలకు సిద్దమవుతోంది. మరి రజినీకాంత్ క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఇక అజిత్ - శివ కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘విశ్వాసం’ కూడా జనవరి 10 నే విడుదల చేస్తున్నామంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
మరి ఇద్దరు బడా స్టార్స్ చిత్రం ఒక్క రోజు గ్యాప్‌తో విడుదల కావడం అంటే అభిమానులకు మాములు ఆనందంగా లేదు. మరి తమిళనాట హోరాహోరీగా ఉన్న ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ టాలీవుడ్ లో కూడా విడుదల చేస్తారు. అయితే రామ్ చరణ్, బాలయ్య సినిమాలకున్న ఉన్న క్రేజ్ ఆ డబ్బింగ్ సినిమాలకు లేకపోయినా... ఆ సినిమాల వలన ఈ రెండు సినిమాలకు కలెక్షన్స్ తగ్గే ప్రమాదం అయితే ఉంది. చూద్దాం 2019 పొంగల్ మరెంత రసవత్తరంగా మారుతుందో అనేది.