Advertisementt

నాగ్ ఈసారి వేలెట్టలేదంట..!!

Fri 02nd Nov 2018 10:19 PM
nagarjuna,savyasachi,editing,king nag,naga chaitanya  నాగ్ ఈసారి వేలెట్టలేదంట..!!
Nagarjuna Not Interfere in Chaitu Savyasachi నాగ్ ఈసారి వేలెట్టలేదంట..!!
Advertisement
Ads by CJ

తన సినిమాలు స్టోరీ నుండి రిలీజ్ వరకు చూసుకునే నాగార్జున తన కొడుకులు సినిమాల విషయంలో కొంచం ఎక్కువ శ్రద్దే చూపిస్తుంటారు. అఖిల్ కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటికి తన సినిమాల విషయంలో హ్యాండ్ త‌ప్ప‌నిస‌రి. అలానే రీసెంట్ గా వచ్చిన నాగ చైతన్య మూవీ ‘శైల‌జారెడ్డి అల్లుడు’కీ నాగ్ హ్యాండ్ ప‌డింది. కానీ అది అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇలా తన కొడుకుల సినిమాల విషయంలో ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని మరి రిపేర్ చేస్తుంటాడు నాగ్. అవి కొన్నిసార్లు వర్క్ అవుట్ అయితే.. కొన్నిసార్లు బెడ‌సి కొట్టాయి.

అయితే ‘స‌వ్య‌సాచి’ విషయంలో నాగ్ జోక్యం చేసుకోలేదట. పూర్తి బాధ్యతలు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పైనే పెట్టేశాడట. ఇది కొంచం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘శైల‌జారెడ్డి అల్లుడు’ ఫ్లాప్ అయ్యింది. ఈ పరిస్థితిల్లో ‘స‌వ్య‌సాచి’ కోసం మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడ‌నుకున్నారు. కానీ నాగ్ ఆ సినిమాపై దృష్టి పెట్ట‌లేదు. కాకపోతే ఎప్పుడో ఒక్కసారి ఎడిటింగ్ వెర్షన్ చూసి కొన్ని సలహాలు ఇచ్చాడట అంతే. ఆ తరువాత దాన్ని పట్టించుకోలేదు అని తెలుస్తుంది.

ఇదంతా నాగ్‌కి మైత్రీ మూవీస్‌పై, ద‌ర్శ‌కుడిపై ఉన్న న‌మ్మ‌క‌మా? లేదంటే ఇలాంటి క్లిష్ట‌మైన క‌థ‌ల్లో జోక్యం చేసుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం అనుకున్నాడా? అనేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 

Nagarjuna Not Interfere in Chaitu Savyasachi:

No Nagarjuna mark in Naga Chaitanya Savyasachi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ