ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘మీటూ’ ఉద్యమం ఊపందుకుంటోంది. దీనిలో భాగంగానే మగవారిపై మహిళల వేధింపులకు కూడా నిరసనగా బెంగుళూరులో ‘మెన్‌టూ’ ఉద్యమం మొదలైంది. ఇక ‘మీటూ’ మలివిడత ఉద్యమానికి కేంద్రబిందువుగా తనుశ్రీదత్తా మారిన విషయం తెలిసిందే. ఆమె దేశం గర్వించదగ్గ నటుడు నానా పాటేకర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. దాంతో నానాపాటేకర్, అలోక్‌నాథ్ వంటి వారి జాతకాలు తిరగబడ్డాయి. మరోవైపు సాజిద్‌ఖాన్, సుభాష్‌ఘయ్‌లు కీలక ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకున్నారు. అదే సమయంలో తనుశ్రీదత్తా పేరుకి మాత్రమే ఆడదని, ఆమె లక్షణాలన్నీ మగబుద్దులేనని, తనను డ్రగ్స్ తీసుకోమని బలవంతం చేయడమే గాక తనని లెస్పియన్‌గా మార్చడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసిందని బాలీవుడ్ సెక్స్‌బాంబ్ రాఖీసావంత్ ఆరోపించింది.
దీనితో భాగంగా ‘షిటు’ ఉద్యమం మొదలుకావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తనుశ్రీ తనను ఎక్కడెక్కడ అసభ్యంగా తాకిందో దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని న్యాయస్థానంలోనే బయటపెడతానని రాఖీ ప్రకటించింది. తాజాగా ఇలాంటి మరో ఆరోపణ ఇప్పుడు దక్షిణాదిలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళంలో ‘తొడరి, మగళిర్ ముట్టమ్, వేట్టైకారన్’ వంటి చిత్రాలలో కీలకపాత్రలను పోషించిన నటి మాయా ఎస్.కృష్ణన్. తాజాగా ఈమె దేశంలోనే అత్యంతప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న శంకర్-రజనీకాంత్-అక్షయ్‌కుమార్‌ల ‘2.ఓ’లో కూడా కీలకపాత్రను పోషించింది.
ఈమెపై సహనటి అనన్య రామ్‌ప్రసాద్ షాకింగ్ ఆరోపణలు చేసింది. మాయా తనని లెస్బియన్‌గా మారమని ఎంతో బలవంతం చేసిందని ఆమె తాజాగా బహిరంగంగా తెలిపింది. ఆమె మాట్లాడుతూ, నాతో లెస్బియన్ రిలేషన్ కోసం మాయా బలవంత పెట్టింది.... అని ఆమె చేసిన ఆరోపణ ప్రస్తుతం కలకలం రేపుతోంది. మరి దీనిపై మాయా ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సివుంది. వీటిని బట్టి ‘మీటూ’ ఉద్యమ లోతుల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను తాజా పరిణామం తెలుపుతోంది.