Advertisementt

రెండో పెళ్లిపై అమలా.. కీలక వ్యాఖ్యలు

Fri 02nd Nov 2018 02:32 PM
amala paul,second marriage,politics,career  రెండో పెళ్లిపై అమలా.. కీలక వ్యాఖ్యలు
Amala Paul about her second marriage రెండో పెళ్లిపై అమలా.. కీలక వ్యాఖ్యలు
Advertisement
Ads by CJ

తెలుగులో ‘ఇద్దరమ్మాయిలతో, నాయక్‌’ వంటి చిత్రాలలో నటించిన సంచలన నటి అమలాపాల్‌. కాగా ఈమె తన మొదటి వివాహం ప్రేమించి పెళ్లి చేసుకుంది. దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌తో ఈమె వివాహం జరుగగా, ఈ వివాహం జరిగిన కొద్దిరోజులకే వారు విడిపోయారు. ఆ తర్వాత ఆమెకి ఇంతకు ముందు కంటే భారీ అవకాశాలు వస్తూ ఉన్నాయి. గతంలో కంటే కాస్త గ్లామర్‌ డోస్‌ని కూడా ఈమె బాగా పెంచింది. దాంతో తమిళ, మలయాళ చిత్రాలతో ఈమె బిజీగా మారింది. 

తాజాగా ఆమె తన రెండో వివాహం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలోనే తనకు రెండో వివాహం, దర్శకత్వంపై ఇష్టం, రాజకీయాలలోకి ప్రవేశంపై ఆమె తన మనోగతాన్ని తెలిపింది. తాజాగా మరోసారి ఈమె అవే విషయాలను మీడియాకు వెల్లడించింది. ఈమె రెండో వివాహం గురించి ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌ మీదనే ఉంది. ఇప్పట్లో మరలా పెళ్లి చేసుకునే ఆసక్తి లేదు. మొదటి వివాహం నా నిర్ణయంతో జరిగింది. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. నా నిర్ణయం తప్పు అని నిరూపితం అయింది. 

అందువల్ల ప్రస్తుతం నా పెళ్లి విషయాన్ని నా తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేశాను. వారు నా మంచినే కోరుకుంటారు... కాబట్టి వారు ఎవరిని ఎంపిక చేస్తే వారినే చేసుకుంటాను. ఇక నాకు దర్శకత్వం వహించి, మెగాఫోన్‌ చేపట్టాలనే కాదు.. రాజకీయాలలోకి కూడా ప్రవేశించాలని ఉంది. కాబట్టి అవి కూడా జరిగే అవకాశం ఉందని చెప్పడం కొసమెరుపని చెప్పాలి. 

Amala Paul about her second marriage:

Mega Beauty Ready For 2nd Marriage  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ