Advertisementt

సూపర్‌స్టార్ ‘మహర్షి’ సంగతులివే..!!

Fri 02nd Nov 2018 01:32 PM
mahesh babu,maharshi,shooting,updates  సూపర్‌స్టార్ ‘మహర్షి’ సంగతులివే..!!
Maharshi Movie Latest Updates సూపర్‌స్టార్ ‘మహర్షి’ సంగతులివే..!!
Advertisement
Ads by CJ

వంశీ పైడిపల్లి - మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'మహర్షి'. రీసెంట్ గా ఈచిత్రం అమెరికాలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ జరుపుకుని తిరిగి ఇండియాకి వచ్చిందని తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో నవంబర్ రెండో వారం నుండి స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ కోసం టీం మొత్తం రెడీ అవుతుంది.

ఇది ఇలా ఉండగా అమెరికాలో జరిగిన భారీ షెడ్యూల్ లో పూజా కనిపించలేదు. అమెరికా షెడ్యూల్ లో పూజా పాల్గొనలేదని తెలుస్తుంది. సాధారణంగా పూజా ఏ సినిమా చేస్తున్న ఆ లొకేషన్ నుండి ఫొటోస్ తీసి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అలా చేయలేదు. 'మహర్షి' గోవా షెడ్యూల్ నుంచి కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది అప్పట్లో. తరువాత ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా ఇటలీలో జరుగుతుంటే అక్కడ నుండి కూడా ఫొటోస్ పెట్టింది. 'అరవింద సమేత' టైములో కూడా చాలాసార్లు లొకేషన్ నుండి ఫొటోస్ పెట్టేది. కానీ ఈసారి 'మహర్షి' అమెరికా షెడ్యూల్ కి సంబంధించి ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు. సో దాంతో పూజా ఈ షెడ్యూల్ లో పాల్గొనలేదని భావించవచ్చు.

మరోపక్క ఈ సినిమాలో మహేష్ ఐటీ కంపెనీకి ఓనర్ గా అండ్ రైతు పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగింది. ఓ సాఫ్టువేర్ కంపెనీ ఓనర్ గా మహేష్ కు సంబంధించిన సీన్స్ అమెరికాలో షూట్ చేశారట. రామోజీ ఫిలింసిటీలో జరిగే షెడ్యూల్ లో మహేష్ ని రైతు పాత్రలో చూపించనున్నాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. మహేష్ కి స్నేహితుడుగా అల్లరి నరేష్ నటిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవబోతుంది.

Maharshi Movie Latest Updates:

Mahesh Babu Maharshi Shooting in Full Swing

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ