Advertisementt

RRR విషయంలో రాజమౌళికి కష్టమయ్యేది ఇదే!

Fri 02nd Nov 2018 10:38 AM
rajamouli,ram charan,ntr,multistarrer,heroines,confusion  RRR విషయంలో రాజమౌళికి కష్టమయ్యేది ఇదే!
Tough Task to Rajamouli for RRR Movie RRR విషయంలో రాజమౌళికి కష్టమయ్యేది ఇదే!
Advertisement
Ads by CJ

ఐదేళ్లుగా బాహుబలి కోసం శ్రమించిన రాజమౌళి కొద్దిరోజుల విరామంతో... మళ్ళీ మగధీర సినిమాని జపాన్ లో విడుదల చేసే పనుల్లో శ్రమించి... తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేశాడు. ఈ సినిమాని గత మార్చిలోనే ప్రకటించినప్పటికీ.. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుండే.. రాజమౌళి RRR పైన కూర్చున్నాడని సన్నిహిత వర్గాల భోగట్టా. తాజాగా ఈ సినిమా మీద ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలు మొదలైపోయాయి. అసలే వేడెక్కిన ఈ సినిమా న్యూస్ ల మీద రోజుకి అరడజను వార్తలు పుడుతున్నాయి. ఈ సినిమా ఈ నెల మొదటి వారం అంటే.. అతి త్వరలోనే ఓపెనింగ్ చేసుకోబోతుందని... ఎన్టీఆర్, రామ్ చరణ్ ల లుక్స్ కూడా ఈ నెల మూడో తారీఖున వదులుతారనే న్యూస్ మాములు లాగా ప్రచారం జరగడం లేదు. ఇప్పటికే తారక్ ఈ సినిమా కోసమే భారీ కసరత్తులు మొదలు పెట్టగా... రామ్ చరణ్ ఇంకా ఫోటో షూట్స్ తో లుక్ ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు.

అయితే ఇద్దరు స్టార్ హీరోలలో సినిమాని చెక్కుతున్న జక్కన్న ముందున్న క్లిష్టమైన సమస్య ఏమిటంటే.. ఆ ఇద్దరు స్టార్ హీరోలకు హీరోయిన్స్ ని సెట్ చెయ్యడమే. రాజమౌళి సినిమాల్లో హీరోయిన్స్ పాత్ర కూడా భారీగానే ఉంటుంది. మరీ తీసేసినట్టుగా ఉండదు. అందుకే జక్కన సినిమాలో చేసేందుకు హీరోయిన్స్ తహతహలాడుతుంటారు. అయితే తాజాగా RRR లో ఎన్టీఆర్ కి, చరణ్ కి రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, రాశిఖన్నాల పేర్లు బాగా వినబడినాయి. అయితే మొదట్లో ఈ పేర్లు ప్రచారంలోకొచ్చినప్పుడు.. రకుల్ అండ్ కీర్తి, రాశిఖన్నాలు మంచి ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్స్ ప్లాప్స్ తో ఫామ్ కోల్పోయారు. ఇక మిగిలిన కాజల్ అగర్వాల్, సమంత, తమన్నా లాంటి హీరోయిన్స్ క్రేజ్ అంతగా లేదు. అలాంటి టైంలో రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు. మరి ముగ్గురిలో ఒకరు విదేశీ హీరోయిన్ అంటున్నారు. మిగతా ఇద్దరు హీరోయిన్స్ ఎవరనేది ప్రస్తుతం అందరిముందున్న పెద్ద ప్రశ్న. 

మరి ప్రస్తుతం ఇండస్ట్రీలో పూజాహెగ్డేకి, కైరా అద్వానీలకే కాస్తో కూస్తో క్రేజుంది. మరి వాళ్లేమో రెండేసి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా వారు రాజమౌళి రేంజ్ కి సరిపోరు. మరి రాజమౌళి ఈ భారీ మల్టీస్టారర్ కోసం ఏ హీరోయిన్స్ ని సెలెక్ట్ చెయ్యబోతున్నాడో గాని.. ప్రస్తుతమైతే ఏ హీరోయిన్ కూడా రాజమౌళి లిస్ట్ లో ఉన్నట్టుగా ప్రచారం అయితే జరగడం లేదు. మరి ఎన్టీఆర్ కి, చరణ్ కి రాజమౌళి ఎలాంటి హీరోయిన్స్ ని పడతాడో అనేది ఫుల్ సస్పెన్స్ గానే ఉంది.

Tough Task to Rajamouli for RRR Movie:

Confusion on RRR Movie Heroines Selection