Advertisementt

ఈ టైమ్‌లో ఇలియానాపై ఈ వార్తలేంటి?

Thu 01st Nov 2018 06:17 PM
ileana role,amar akbar antony,shocking update,raviteja,srinu vaitla  ఈ టైమ్‌లో ఇలియానాపై ఈ వార్తలేంటి?
Shocking Update on Ileana role in AAA Movie ఈ టైమ్‌లో ఇలియానాపై ఈ వార్తలేంటి?
Advertisement
Ads by CJ

వరస ప్లాప్స్‌తో రవితేజ అండ్ శ్రీను వైట్ల చాలాకాలం తరువాత చేస్తున్న చిత్రం “అమర్ అక్బర్ అంటోనీ”. ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ చూస్తే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని అర్ధం అవుతుంది. ఇందులో రవితేజ త్రీ షేడ్స్ లో నటిస్తున్నాడు. చాలా రిచ్ విజువల్స్ తో తెరకెక్కిన ఈచిత్రంను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

తాజా సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ ఇలియానా పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రనీ సమాచారం. టీజర్ లో చూపించినట్టు ఏమి ఉండదని...సినిమాలో అంత సీను ఉండదంటూ ప్రచారం జరుగుతోంది. సినిమా మొత్తం మీద ఆమె పాత్ర 30 నిమిషాల లోపే ఉంటుందని టాక్.

మొదట ఈసినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలు వల్ల ఆమె ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయింది. ఆ తరువాత ఆమె ప్లేస్ లోకి ఇలియానా వచ్చింది. చాలా కాలం తర్వాత ఇలియానా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరి కన్ను ఆమె పాత్రపై పడింది. కానీ ఆమె పాత్ర చాలా తక్కువ సమయమే ఉంటుందని తెలియడంతో తన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. నవంబర్ 16న రిలీజ్ అవుతున్న ఈసినిమా శ్రీనుని..రవిని ప్లాప్స్ నుండి బయట పడేస్తుందేమో.. చూద్దాం.

Shocking Update on Ileana role in AAA Movie:

No Importance to Ileana Role in Amar Akbar Antony

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ