Advertisementt

విజయ్ దేవరకొండని లైట్ తీసుకుంటున్నారా?

Thu 01st Nov 2018 04:34 PM
amar akbar antony,taxiwala,raviteja,vijay deverakonda,aaa,release details  విజయ్ దేవరకొండని లైట్ తీసుకుంటున్నారా?
Amar Akbar Antony Full Speed in Promotions విజయ్ దేవరకొండని లైట్ తీసుకుంటున్నారా?
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ నోటా సినిమాతోనూ, రవితేజ అమర్ అక్బర్ ఆంటొనీ తోనూ పోటీ పడుతున్నారంటూ గతంలో చాలా వార్తలొచ్చాయి. కానీ రవితేజ సైలెంట్ గా అమర్ అక్బర్ ఆంటోని ని విడుదల చెయ్యకుండా తప్పుకున్నాడు. కానీ విజయ్ దేవరకొండ అనుకోకుండా నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. అప్పట్లో గీత గోవిందం తో సూపర్ ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండని తట్టుకుని.... ప్లాప్స్ లో ఉన్న రవితేజ అమర్ అక్బర్ ఆంటొనీతో ఎలా నిలబడతాడో అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే అప్పుడు రవితేజ, విజయ్ నుండి తప్పుకున్నాడు. అయితే విజయ్ గీత గోవిందం క్రేజ్ మొత్తం నోటా తో తుడిచిపెట్టుకుపోయింది. విజయ్ నటించిన నోటా సినిమా ఈ నెల మొదటి వారంలో విడుదలై ప్లాప్ అయ్యింది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం క్రేజ్ మొత్తం ఒకే ఒక సినిమాతో పోయిందన్నారు. కానీ విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం యూత్ లో ఏమాత్రం తగ్గలేదు. యూత్ లో ఎంత క్రేజున్నా విజయ్ నటించిన నోటా తేడా కొట్టడంతో పాటు, విడుదలకు ముందే టాక్సీవాలా సినిమా మొత్తం లీక్ కావడంతో.. ఇప్పుడు టాక్సీవాలా విడుదల కష్టాలు ఎదుర్కొంటుంది. అయితే ఎలాగోలా ఆ సినిమాని నవంబర్ 18 కి విడుదల చెయ్యడానికి సిద్ధమయ్యారు. మరి నోటా సినిమా ప్లాప్ అవడంతో విజయ్ మార్కెట్ తగ్గిందనే ధైర్యంతో  రవితేజ - శ్రీను వైట్ల‌లు తమ అమర్ అక్బర్ ఆంటొని సినిమాని నవంబర్ 18 కే దింపుతున్నారు.

మరి అప్పుడు నోటా నుంచి తప్పించుకుని.. ఇప్పుడు టాక్సీవాలా బారిన పడ్డారు రవితేజ - శ్రీను వైట్ల. అయితే విజయ్ మార్కెట్ తగ్గిందని కాదు గాని.. విజయ్ టాక్సీవాలాకు నెంబరాఫ్ రిలీజ్ డేట్స్ మారడంతో.. సినిమాపై ప్రేక్షకులకు మొదట్లో ఉన్నంతగా ఆసక్తి లేదు. దీనిపై ఆసక్తి పెంచడానికి చాలా కష్టపడుతున్నారు మేకర్స్. మరి ఇలాంటి టైం లోనే రవితేజ మంచి ప్రమోషన్స్ తో అమర్ అక్బర్ ఆంటొనితో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టాలనే ప్లాన్ తో ఉన్నాడు. మరి ఇదంతా చూస్తుంటే విజయ్ నోటా దెబ్బకి అమర్ అక్బర్ ఆంటొనీకి బాగా ధైర్యం వచ్చినట్టుగా, టాక్సీవాలాని లైట్ తీసుకుంటున్నట్లుగా కనబడుతుంది కదా!

Amar Akbar Antony Full Speed in Promotions:

Amar Akbar Antony vs Taxiwala

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ