Advertisementt

పవన్‌తో సినిమా.. అది నిజం కాదు: నిర్మాతలు

Wed 31st Oct 2018 11:41 PM
pawan kalyan,mythri movie makers,movie,advance,power star,raviteja  పవన్‌తో సినిమా.. అది నిజం కాదు: నిర్మాతలు
Mythri Movie Makers planned movie with Pawan Kalyan పవన్‌తో సినిమా.. అది నిజం కాదు: నిర్మాతలు
Advertisement
Ads by CJ

 

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు టాలీవుడ్ అగ్ర కథానాయకులకు..దర్శకులకి అడ్వాన్స్ ఇచ్చి వారిని లాక్ చేయడంలో ముందు ఉంటారు. ఇలా ప్రతీ సినిమా విషయంలో ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేసి అందరిని లాక్ చేస్తూ ఉంటారు. కొన్ని నెలలు కిందట వీరు పవన్ కల్యాణ్ కు సంతోష్ శ్రీనివాస్ సినిమా కోసం అడ్వాన్స్  ఇచ్చి ఉన్నారు.

తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘థేరి’ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్‌తో తీసేందుకు అన్నీ సిద్ధం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ సడెన్ గా పాలిటిక్స్ లో బిజీ అయిపోవడం..ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ లో పవన్ కి బదులు రవితేజ రావడం జరిగింది. త్వరలోనే సంతోష్ శ్రీనివాస్ - రవితేజ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. దానికి సంబంధించి పవన్ నుంచి అనుమతి తీసుకున్నామని నిర్మాతలు చెబుతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించారు. పవన్ ఇంకా సినిమాలు చేయడని వార్తలు కూడా వచ్చాయి. ఈనేపధ్యంలో పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత? అని అడిగిన ప్రశ్నకు.. ‘‘వాటిలో నిజం లేదు. మేము పవన్ కల్యాణ్ గారిని అడ్వాన్సు తిరిగి ఇవ్వమని అడగలేదు. ఆయనతో సినిమా వుంటుంది. ఎన్నికల తరువాత పవన్ సినిమా చేస్తారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా ఉంటుంది అది ఎప్పుడో..అందులో హీరో ఎవరో అన్న విషయాలు త్రివిక్రమ్ నిర్ణయానికి వదిలేశామని తెలిపారు.

Mythri Movie Makers planned movie with Pawan Kalyan:

They Still Keep Hopes On Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ