Advertisementt

ఫస్ట్ తమన్నాని అనుకున్నాం.. కానీ: చందూ

Wed 31st Oct 2018 03:58 PM
thamanna,naga chaitanya,savyasachi,chandoo mondeti,nag song  ఫస్ట్ తమన్నాని అనుకున్నాం.. కానీ: చందూ
Chandoo Mondeti About Savyasachi Movie ఫస్ట్ తమన్నాని అనుకున్నాం.. కానీ: చందూ
Advertisement
Ads by CJ

చందుమొండేటి.. ఈయన తీసిన 'సవ్యసాచి' 2వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో నాగచైతన్య మీద ఆయన తండ్రి చేసిన 'నిన్ను రోడ్డుమీద చూసినది లగాయిత్తు' అనే పాట తెరపై ఎలా ఉంటుందో అనేది కూడా అక్కినేని అభిమానుల్లో ఇంట్రస్ట్‌ని రేకెత్తిస్తోంది. దీని గురించి చందు మొండేటి మాట్లాడుతూ, వారసత్వం ఉన్న హీరోల చిత్రాలలో వారి ఫ్యామిలీకి చెందిన పాటలు పెడితే అభిమానులకు, ప్రేక్షకులకు సరదాగా ఉంటుంది. 

ఇక ఈ రీమిక్స్‌సాంగ్‌ సెకండ్‌ హాఫ్‌లో వస్తుంది. చైతు ఫుల్‌జోష్‌తో చేశాడు. సాంగ్‌ టీజర్‌లో మీరు చూసింది కేవలం శాంపిలే. మొదట ఈ పాటకు రమ్యకృష్ణ లాగా తమన్నాని అనుకున్నాం. కానీ మా స్క్రిప్ట్‌కి తగ్గట్లు కుదరలేదని నిధితో చేశాం. నిధి కూడా మంచి డ్యాన్సర్‌. మేమేదో కొత్తపాయింట్‌ని చూపిస్తున్నాం అని చెప్పడం లేదు. ఆల్‌రెడీ ఉన్న విషయాన్నే మరోసారి కొత్తగా చూపిస్తున్నాం. నెక్ట్స్‌ 'కార్తికేయ 2'లైన్‌లో ఉంది. ఆ పాయింట్‌ని డీల్‌ చేసే సామర్ధ్యం నాకింకా రాలేదని అనుకుంటున్నాను. నాగార్జున గారి కోసం ఓ స్క్రిప్ట్‌ రెడీగా ఉంది. కానీ నా నెక్ట్స్‌ చిత్రం ఏది ఉంటుందో చెప్పలేను.. అంటూ ఇలాంటి విషయాలను కూడా ఎంతో హుందాగా ఒప్పుకున్న చందు మొండేటికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. 

ఇక ఈయన మాధవన్‌ గురించి మాట్లాడుతూ, మాధవన్‌ గారు ఇండియా వైడ్‌ యాక్టర్‌. ఆయన ఫస్ట్‌ సినిమా నుంచి చూస్తే అన్ని విభిన్న చిత్రాలే ఉంటాయి. నేను ఓ 45 నిమిషాల కథ చెప్పగానే ఎంతో బాగుంది.. చేద్దాం అనడంతో నమ్మకం వచ్చింది అని చందు చెప్పుకొచ్చాడు. 

Chandoo Mondeti About Savyasachi Movie:

First Tamanna for Savyasachi Movie nag Song says Chandoo Mondeti

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ