తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ చిత్రం తెరమీదకు రానుంది. ‘పలాస 1978’ పేరుతో కరుణ కుమార్ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘యదార్థ సంఘటనల ఆధారంగా ‘పలాస 1978’ చిత్రాన్ని తెరమీదకు తీసుకువస్తున్నాము. పలు చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పనిచేసిన కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ హీరోతో పాటు వర్ధమాన కథానాయకుడు ఈ చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాము. ఇతర నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను త్వరలోనే తెలియజేస్తాము..’’ అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె, సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలు: అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్, దర్శకత్వం: కరుణ కుమార్.