క్రిస్‌మస్‌తో పాటు అన్ని మతాల పండుగలను జరుపుకోవడంలో మెగా ఫ్యామిలీ ఎప్పుడు ముందు ఉంటూ ఉంటుంది. ఫ్యామిలీలోని అందరు దాదాపు కళాకారులే కావడం, వారికంటూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉండటం.. మెగాభిమానుల్లో కుల, మత, ప్రాంతాలకు అతీతమైన వీరాభిమానులు ఉండటంతో వీరు తమ జన్మదినోత్సవాలను ఎలా జరుపుకుంటారో.. ప్రతి వేడుకను అదే రీతిలో చేసుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు.
ఇక విషయానికి వస్తే తాజాగా మెగా కుటుంబసభ్యులు ‘హాలోవీన్’ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. విచిత్ర వేషధారణతో బాగా సందడి చేశారు. చిరంజీవి, అల్లుఅర్జున్, స్నేహారెడ్డి, ఉపాసన, వరుణ్‌తేజ్, నిహారిక, సుస్మిత, శ్రీజ, కళ్యాణ్‌దేవ్ తదితరులు భయంకరమైన గెటప్‌లో కనిపించారు. ముఖానికి రంగులు వేసుకుని విచిత్ర దుస్తులతో ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇవి మెగాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. తన అత్త సురేఖను ఉపాసన భయపెడుతున్న ఫొటోని మెగాకోడలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘ఎంతో మంచి అత్తమ్మ.. భయంకరమైన కోడలు.. హాలోవీన్ పార్టీ...’ అని దానికి తనదైనశైలిలో క్యాప్షన్ ఇచ్చింది.
కాగా ‘హాలోవీన్’ వేడుకలో అక్టోబర్ 31తో ముగియనున్నాయి. మెగాఫ్యామిలీ ఫొటోలను చూస్తే రామ్‌చరణ్ అయ్యప్ప మాలధారణలో ఉన్నట్లు అర్ధమవుతోంది. ఆయన మాత్రం తన మాల వేషధారణలో సంప్రదాయ బద్దంగా తన ఫ్యామిలీతో కలసి ఫోజులిచ్చాడు. చెర్రీ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి ‘వినయ విధేయ రామా’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని దీపావళికి విడుదల చేయనున్నారు.
కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ అన్నా వదినలుగా ప్రశాంత్, ఆర్యన్‌రాజేష్, స్నేహ వంటి పలువురు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ పూర్తికాగానే చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో చేసే మల్టీస్టారర్‌లో నటించనున్నాడు.