నిన్న సోషల్ అండ్ వెబ్ మీడియా మొత్తంగా వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించాల్సిన ‘వెంకీమామ’ సినిమా ఆగిపోయిందనే న్యూస్ ఫిలింనగర్ సాక్షిగా చక్కర్లు కొట్టింది. సురేష్ బాబుకి దర్శకుడు బాబీ చెప్పిన కథ నచ్చలేదని.. మొదట్లో స్టోరీ లైన్ కి ఓకె చెప్పిన సురేష్ బాబు ఫైనల్ వెర్షన్ విన్నాక ఈ సినిమా చెయ్యకపోవడం ఉత్తమమనే భావనలో ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు కేవలం గాలి వార్తలే అని.. వెంకీ మామ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సెట్స్ మీద కెలుతుందని.. కానీ కాస్త సమయం పడుతుంది అంటూ... సాయంత్రానికల్లా మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు.
నాగ చైతన్య - వెంకటేష్ లు తమ తమ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడం వలన ఈ వెంకీమామ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి టైం పడుతుంది కానీ.. మిగతా ఎలాంటి సమస్యలు లేవని చెబుతున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం సవ్యసాచి ప్రమోషన్స్ తో బిజీగా ఉండడం.. అలాగే సమంతతో కలిసి శివ నిర్వాణ ప్రాజెక్ట్ లో బిజీ కావడం చేతే బాబీ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మిస్తున్న వెంకిమామ షూటింగ్ కి రాలేకపోతున్నాడంటున్నారు. ఇక వెంకటేష్ కూడా వరుణ్ తేజ్ తో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 అనే కామెడీ మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
అయితే నాగ చైతన్య మాత్రం సవ్యసాచి విడుదల కాగానే వెంకీ మామ షూటింగ్ లో పాల్గొంటాడని... వెంకటేష్ మాత్రం ఎఫ్ 2 కంప్లీట్ కాగానే షూటింగ్ కి హాజరవుతాడని అంటున్నారు. మరి ముందుగా నాగ చైతన్య మీద సీన్స్ ని షూట్ చేసి ఆతర్వాత వెంకీ, చైతు కాంబో సీన్స్ షూట్ చేస్తారని తెలుస్తుంది. రచయిత జనార్థన మహర్షి కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నాడు. వెంకటేష్ సరసన తమన్నా, నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.