మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ ద్వారా తన 150వ ప్రతిష్టాత్మక చిత్రంగా, దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇస్తూ పెద్ద హిట్ కొట్టాడు. ఇక బోయపాటి శ్రీను-అల్లుఅర్జున్‌ల ‘సరైనోడు’ చిత్రం పెద్ద హిట్ కావడంతో చిరుతో 151వ చిత్రాన్ని తన గీతాఆర్ట్స్ బేనర్‌లో చేసేందుకు అల్లుఅరవింద్ రెండో చిత్రానికి సైతం బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చాడు. అల్లుఅరవింద్‌తో పాటు చిరు కూడా బోయపాటితో తదుపరి చిత్రం చేస్తానని చెప్పాడు. కానీ చిరు మాత్రం తన 151వ చిత్రాన్ని మరలా తన కుమారుడు రామ్‌చరణ్‌కి సంబంధించిన హోం బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లోనే ‘సై..రా..నరసింహారెడ్డి’ చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన నటించే తదుపరి చిత్రం కూడా ఖరారైపోయింది.
‘మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను’ ఇలా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో, తాను ఏ హీరోతో చేస్తే అతనికి కెరీర్‌లోనే పెద్ద హిట్స్‌ని అందిస్తున్న రచయిత, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరు 152వ చిత్రం ఉంటుందని క్లారిటీ కూడా వచ్చేసింది. దీని నిర్మాణం కూడా చరణ్ మరో బ్యానర్‌తో కలిసి చేస్తున్నట్లుగా అఫీషియల్‌గా కూడా వార్తలు వచ్చేశాయి. అంటే ప్రస్తుతానికి మాత్రం బోయపాటి, అల్లుఅరవింద్‌లతో చిరంజీవి చిత్రం ఉండే అవకాశాలు లేనట్లేగా!
మొదట్లో కొరటాల-చిరంజీవి చిత్రం డిసెంబర్‌లోనే ప్రారంభం కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది కాస్త వాయిదాపడిందట. సంక్రాంతి తర్వాత ఈ మూవీ ప్రారంభం కానుంది. కొరటాల పూర్తి స్క్రిప్ట్‌ని మెగాస్టార్‌కి ఇంకా వినిపించకపోవడమే ఆలస్యానికి కారణమని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఇప్పటికే లైన్ చెప్పి ఓకే చేయించుకున్న చిరుని.. త్వరలో కొరటాల కలసి పూర్తి స్క్రిప్ట్‌ని నేరేట్ చేస్తాడట. చిరంజీవి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి ప్రీపొడక్షన్ పనులు మొదలవుతాయి. చిరంజీవికి తగ్గట్లుగా కమర్షియల్ అంశాలు, వినోదంతో పాటు ఇందులో రైతుల గురించి మంచి సందేశం కూడా ఉంటుందని అంటున్నారు.