రామ్ చరణ్ - బోయపాటి సినిమా టైటిల్ విషయంలో ఎడతెగని ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. వినయ విధేయ రామ అంటూ ఒక టైటిల్ మార్కెట్ లో చక్కర్లు కొడుతోంది. కానీ చరణ్ బోయపాటి ల బృందం మాత్రం కన్ఫర్మ్ చెయ్యడం లేదు. ఇక రామ్ చరణ్ టైటిల్ అండ్ లుక్ విషయంలోనూ చిరు పుట్టిన రోజు, వినాయకచవితి, దసరా వెళ్ళిపోయి దీపావళి వచ్చేస్తుంది. దీపావళికి చరణ్ లుక్ అండ్ టైటిల్ అంటున్నారు... కానీ బోయపాటి బృందం నుండి అధికారిక ప్రకటన రావడం లేదు. ఇక టైటిల్ విషయంలో ఎడతెగని సస్పెన్స్ ఉంటే.... ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఐటెం భామ విషయంలో కూడా ఇలానే చర్చ ఒకటి ఫిలింసర్కిల్స్ లో బయలుదేరింది.
బోయపాటి సినిమాలో ఐటెం సాంగ్ స్పెషల్ ఏమిటో తెలుసు. అలాగే దేవిశ్రీ మ్యూజిక్ ఆల్బమ్ లో ఐటెం స్పెషల్ తెలిసిందే. మరి బోయపాటి - దేవిశ్రీ కూడా రామ్ చరణ్ కోసం ఒక అదిరిపోయే ఐటెంని సిద్ధం చేస్తున్నారు.. కానీ ఐటెంలో ఆడిపాడే భామ కోసం మాత్రం బోలెడంత సెర్చింగ్ జరుగుతుంది. ముందుగా బాలీవుడ్ భామని ఎవరో ఒకరిని ఈ ఐటెం కోసం తీసుకొద్దామనుకుంటే.. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ పరిమితిని దాటిపోవడంతో.. ఐటెం కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తెచ్చే పరిస్థితి కనబడ్డం లేదంటున్నారు. ముందసలు శ్రద్ద కపూర్ ని రామ్ చరణ్ కోసం దింపాలనుకుని డ్రాప్ అయ్యారు.
ఇక బాలీవుడ్ హీరోయిన్స్ ని పక్కన పెట్టేసి బోయపాటి బృందం ముందుగా రకుల్ ప్రీత్ ని చరణ్ కోసం ఐటెం చేయమని సంప్రదించగా.. రకుల్ నాకున్న బిజీ షెడ్యూల్ వలన ఐటెంలో ఆడడం కుదరదని చెప్పిందట. మరి సినిమాలు లేక ఖాళీగా ఉన్న రకుల్ ఇలా చెప్పడం విడ్డూరంగానే అనిపిస్తుంది. కాకపోతే ఐటెం సాంగ్స్ చేస్తే ఇక ఐటెం అయ్యి హీరోయిన్ అవకాశాలు రావని భయపడుతుందేమో.. ఇక రకుల్ కాదంటే.. ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్ రేంజ్ లో ఉన్న పూజని ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి. ఇప్పటికే పూజాహెగ్డే రంగస్థలంలో జిగేలు రాణి కోసం ఊరమాస్ స్టెప్స్ తో అదరగొట్టింది. అలాగే తాజాగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీ తార అయ్యింది. ఇలాంటి సమయంలో చరణ్ తో ఐటెంకి పూజ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.