Advertisementt

సెన్సేషనల్‌ నటి మంచి చిత్రంతో రీఎంట్రీ..!

Sat 27th Oct 2018 09:19 PM
nazriya nazim,come back,pink remake,  సెన్సేషనల్‌ నటి మంచి చిత్రంతో రీఎంట్రీ..!
Sensational Actress Re Entry with Super Hit Film సెన్సేషనల్‌ నటి మంచి చిత్రంతో రీఎంట్రీ..!
Advertisement
Ads by CJ

తమిళ, మలయాళ భాషల్లో నజ్రియాకు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈమె హీరోయిన్‌గా మంచి క్రేజ్‌లో ఉన్నప్పుడే సంచలన నిర్ణయం తీసుకుంది. యువత హృదయాలను కొల్లగిట్టిన ఆమె వివాహం తర్వాత వెండితెరకు దూరమైపోయింది. ఫాహద్‌ ఫాజిల్‌తో వివాహం జరిగిన ఆమె దాదాపు ఐదేళ్ల తర్వాత మరలా రీఎంట్రీ ఇవ్వనుంది. అందులోనూ అది అమితాబ్‌బచ్చన్‌, తాప్సిలు నటించగా, మంచి చిత్రంగా, సమాజాన్ని స్పృశించే కథాంశంతో వచ్చి ఘనవిజయం సాధించిన ‘పింక్‌’ చిత్రాన్ని తమిళ, మలయాళ రీమేక్‌ కావడం గమనార్హం.

2016లో వచ్చిన ఈ ‘పింక్‌’ చిత్రాన్ని.. చాలా ఆలస్యంగా ‘ఖాకీ’ చిత్ర దర్శకుడు వినోద్‌ రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక హిందీలో తాప్సి పోషించిన పాత్రను నజ్రియా చేస్తుండగా, అమితాబ్‌ పాత్రను అజిత్‌ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకు అమితాబ్‌ తరహాలో న్యాయం చేయగలిగిన ఏకైక హీరో అజిత్‌ అనే చెప్పాలి. 

విభిన్నమైన కథ, కథనాలతో పాటు అజిత్‌, నజ్రియాలు నటిస్తే దీనికి తమిళంతోపాటు మలయాళం, తెలుగులో కూడా క్రేజ్‌ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ చిత్రం ఓకే అయితే అది అజిత్‌, నజ్రియా ఇద్దరికీ విభిన్న చిత్రం అవుతుందనడంలో సందేహం లేదు. మొత్తానికి ఇంత మంచి చిత్రం ఇప్పటికైనా రీమేక్‌ అవుతుండటం ఆనందం కలిగించే విషయమనే చెప్పాలి. 

Sensational Actress Re Entry with Super Hit Film :

Nazriya Nazim To Come Back With Pink Remake

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ