ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తుండగా.. చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. ఆయనకు సంబంధించిన సీన్స్ అన్ని ఫినిష్ చేశాడు డైరెక్టర్ క్రిష్. అయితే రానా పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది.
ఈ సినిమాలో రానా పాత్ర చాలా తక్కువ సేపే ఉంటుందట. అది కూడా ఒక్క సన్నివేశానికే పరిమితం అని తెలిసింది. అయితే సినిమాకి ఆ సీన్ చాలా కీలకం అని తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జెండాతో గెలిచిన ఎమ్మెల్యేల్ని ఢిల్లీ తీసుకెళ్లి బలనిరూపణ చేయడంలో అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం.
ఆ సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల అందరిని చాలా రహస్యంగా రైలులో ఢిల్లీ తరలించారు. వారితో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఢిల్లీకి వెళ్తున్న సమయంలో మధ్య దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ట్రైన్ పై దాడి చేయడానికి ప్రయత్నించారు కానీ ఆ దాడి నుండి అంతా క్షేమంగా బయట పడ్డారు. అప్పటిలో ఇది సెన్సేషన్ గా నిలిచింది. ఈ టోటల్ ఎపిసోడ్ ఓ యాక్షన్ ఘట్టాన్ని తలపిస్తుంది. ఈ సీన్ లోనే రానా కనిపిస్తాడు. మరి థియేటర్స్ లో ఈ సీన్ కి చప్పట్లు పడతాయో లేదో చూడాలి.