Advertisementt

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టీజర్ ఎప్పుడంటే?

Fri 26th Oct 2018 01:39 PM
amar akbar anthony,teaser,october 29th,raviteja,srinu vaitla,ileana  ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టీజర్ ఎప్పుడంటే?
Amar Akbar Antony Teaser Release Date Fix ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టీజర్ ఎప్పుడంటే?
Advertisement
Ads by CJ

అక్టోబర్ 29 న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టీజర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’.  వీరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా  టీజర్ ని అక్టోబర్ 29 న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గ్లామర్ డాల్ ఇలియానా కథానాయికగా నటిస్తుండగా, రవితేజతో ఆమె నాలుగో సారి కలిసి నటిస్తుండడం విశేషం. పూర్తిభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోగా దర్శకుడు శ్రీనువైట్ల పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన  గ్లిమ్స్ అఫ్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం పూర్తిగా స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుండగా రవితేజ డిఫరెంట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

తారాగణం: రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు.

Amar Akbar Antony Teaser Release Date Fix:

Amar Akbar Anthony Teaser on October 29th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ