Advertisementt

విజయ్, త్రివిక్రమ్ మూవీ ఆగిపోవడానికి కారణమిదే?

Fri 26th Oct 2018 11:27 AM
trivikram srinivas,vijay deverakonda,movie,story  విజయ్, త్రివిక్రమ్ మూవీ ఆగిపోవడానికి కారణమిదే?
Trivikram and Vijay Devarakonda Movie interesting Story విజయ్, త్రివిక్రమ్ మూవీ ఆగిపోవడానికి కారణమిదే?
Advertisement
Ads by CJ

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయినా విజయ్ కు వరస సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న విజయ్ తో సినిమా చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కానీ ‘అర్జున్ రెడ్డి’ కి ముందు విజయ్ అంటే ఓ మాములు హీరో అని తెలుసు అంతే. ‘అర్జున్ రెడ్డి’ తరువాతే విజయ్ కు ఎక్కువ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంతకముందు అల్లు అరవింద్ విజయ్ తో రెండు సినిమాలు ఒప్పందం చేసుకున్నారు.

సరిగా అదే టైములో విజయ్‌కు త్రివిక్రమ్ ఆఫర్ వచ్చింది. అన్ని అనుకున్నట్టే జరిగితే త్రివిక్రమ్-దేవరకొండ కాంబోలో సినిమా ఈపాటికి రిలీజై ఉండేది. కానీ ఆ ప్రాజెక్ట్ జస్ట్ మిస్ అయింది. అసలు ఏమైంది? ఎందుకు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళలేదు? అన్న విషయాలు రైటర్ లక్ష్మీ భూపాల ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఆ ప్రాజెక్ట్ కు కథ, మాటలు అన్ని నందినీ రెడ్డే. ఆ కథను తీసుకుని ఆమె త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి .. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తే బాగుంటుందని కోరారు కానీ కథలో ఎక్కువ లేయర్స్ ఉన్నాయని, విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది హీరోలు కూడా అవసరమని త్రివిక్రమ్ అన్నారు. ఆ టైములో త్రివిక్రమ్ ఓ పెద్ద సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఆ కథ అలా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఆ తరువాత అది స్వప్నాదత్ మూలంగా మళ్లీ బయటకు వచ్చింది. అంతేకాదు ఆ కథ ఓ కొత్త రూపం సంతరించుకుందని చెప్పుకొచ్చాడు లక్ష్మీ భూపాల. అది వెబ్ సిరీస్ గా మారిందని.. అదే గ్యాంగ్ స్టార్స్ అని చెప్పుకొచ్చాడు. ఆ ప్రాజెక్ట్‌కు నేనే  డైలాగ్స్ రాశాను అని అన్నాడు.

Trivikram and Vijay Devarakonda Movie interesting Story:

Reason behind Trivikram and Vijay Devarakonda Cancel 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ