Advertisementt

అమలాకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టారట!

Fri 26th Oct 2018 08:29 AM
amala paul,susi ganesan,metoo,kollywood  అమలాకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టారట!
Metoo: Amala Paul Comments On Susi Ganesan అమలాకి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టారట!
Advertisement
Ads by CJ

చియాన్‌ విక్రమ్‌ నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘మల్లన్న’. భారీ అంచనాలతో విడుదలైనా కూడా నాడు ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. ఈ చిత్ర దర్శకుడు ఆ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. అయినా ఆ తర్వాత కూడా ఈయన కోలీవుడ్‌లో కొన్నిచిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు. ఆయన పేరే సుశీగణేషన్‌. కాగా ఇటీవల ఆయన మీద దర్శకత్వ శాఖలో పనిచేసిన లీనా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన తనను లైంగికంగా వేధించాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ‘మీటూ’ ఉద్యమం ద్వారా తెలిపి సంచలనం సృష్టించింది. 

ఇప్పుడు లీనాకి మద్దతుగా కోలీవుడ్‌ సెన్సేషనల్‌ హీరోయిన్‌ అమలాపాల్‌ ముందుకొచ్చింది. దాంతో సుశీగణేషన్‌పై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. లీనా ఆరోపణలను సమర్థిస్తూ అమలాపాల్‌ గతంలో సుశీగణేషన్‌ తనని కూడా లైంగికంగా వేధించాడని పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌ పెట్టిన వెంటనే అమలాపాల్‌కి దర్శకుడు సుశీగణేషన్‌, అతని భార్య మంజరిలు ఫోన్‌ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, సుశీగణేషన్‌, అతని భార్య మంజరిలు నా వ్యక్తిత్వాన్ని వారు తప్పుపట్టారంటూ మరో ట్వీట్‌ ద్వారా తెలిపింది. లీనాకి పూర్తి మద్దతు ఇస్తున్నాను. లీనా పట్ల సుశీగణేషన్‌ ఎలా ప్రవర్తించి ఉంటాడు? అనే విషయాన్ని నేను ఊహించగలను. సుశీగణేషన్‌ దర్శకత్వంలో నేను ‘తిరుటు పాయలే2’ చిత్రంలో నటించాను. 

ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ధైర్యంగా సుశీగణేషన్‌ గురించిన నిజాలను బయటపెట్టిన లీనాకు నా మద్దతు ఉంటుంది. నాకు సుశీగణేషన్‌, ఆయన భార్య మంజరిలు ఫోన్‌ చేసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. నేను చెప్పేది వినకుండా మంజరి తన నోటికి వచ్చినట్లు మాట్లాడింది. వెటకారంగా నవ్వుతూ, నా వ్యక్తిత్వం గురించి తప్పుగా మాట్లాడింది. ఇలాంటి వారితో నన్ను బెదిరించాలని అనుకుంటున్నారేమో? కానీ నా దగ్గర అవి సాగవు.. అని తేల్చిచెప్పింది. 

Metoo: Amala Paul Comments On Susi Ganesan:

Director And Wife Abused Amala  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ