జోరుగా నవంబర్ 16న రానున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'హుషారు'
'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం వేణుగోపాల్ 'మేము వయసుకు వచ్చాం' , 'సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు. ఈ సంస్థలో 9 వ చిత్రంగా 'హుషారు' తీస్తున్నారు. రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణం. 'అర్జున్ రెడ్డి' తో పాపులర్ అయిన సంగీత దర్శకుడు రథన్ , ఛాయాగ్రాహకుడు రాజ్ తోట ఈ చిత్రానికి పనిచేశారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నవంబర్ 16న విడుదలకి సిద్దమయింది.
నిర్మాతబెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - 'మా బ్యానర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే సినిమా ఇది. కథా కథనాలు చాలా ఇన్నోవేటివ్ గా , ట్రెండీగా ఉంటాయి. దర్శకుడు శ్రీ హర్ష ఎక్స్ లెంటుగా తెరకెక్కించాడు. షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది. నవంబర్ 16 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారి చేతుల మీద విడుదల చేసిన లిరికల్ వీడియో సాంగ్ కి విశేష ఆదరణ లభిస్తోంది . దీంతో పాటు అన్ని థియేటర్స్ లో థియేట్రికల్ ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుండి ఆదరణ లభిస్తోంది' అని తెలిపారు. ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ : వీణా రాణి , అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : లక్ష్మినారాయణ , లింగా శ్రీనివాస్.