బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాంటి చిత్రంతో అలరిస్తాడో అని ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. బాహుబలితో ఇంటర్నేషనల్ ఫిగర్ గా మారిన ప్రభాస్ ఒకే ఒక సినిమా అనుభవమున్న దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ‘సాహో’ సినిమాని ఇండియాలోని పలు భాషల్లో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో చేస్తున్నాడు. ఇక ప్రభాస్ సాహో లుక్ ఎపుడో బయటికి వచ్చింది. ఇక ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ సాహో నుండి మరిన్ని లుక్స్ గాని... టీజర్ లాంటిది గాని బయటికి రావాలని కోరుకోవడం.. ప్రభాస్ అభిమానులకి ట్రీట్ గా ప్రభాస్ సాహో చాప్టర్ 1 అంటూ కొత్తగా సాహో మేకింగ్ వీడియోని వదిలారు.
మరి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన ఈ సాహో చాప్టర్ 1 లో హాలీవుడ్ సినిమా లో వుండే యాక్షన్ ఎపిసోడ్ రేంజ్ లో ఈ మేకింగ్ వీడియో అదిరిపోయింది. దుబాయ్ లోని అబుదాబిలో కోట్ల ఖర్చు తో చిత్రీకరించిన ఈ యాక్షన్ ఎపిసోడ్ కు 400 మంది పనిచేయగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ దీనికి నేతృత్వం వహించారు. మరి ఆ యాక్షన్ ఎపిసోడ్ సాహో సినిమాకే హైలెట్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగినా.. ఇప్పడు ఆ ఎపిసోడ్ చూసాక సాహో సినిమాకి ఈ యాక్షన్ ఎపిసోడ్ తలమానికం అనిపించకమానదు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా స్టయిలిష్ అండ్ డేరింగ్ లుక్స్ తో కిల్ చేసేస్తున్నాడు.
ప్రభాస్ బైక్ మీద వస్తున్నప్పటి లుక్ కానివ్వండి స్పెట్స్‌తో అలా చూస్తూ వస్తున్న లుక్ కానివ్వండి... ప్రభాస్ లుక్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్ లో చివరి రెండు షాట్స్ కూడా అద్భుతమనే చెప్పాలి. అలాగే ఈ టీజర్ లో హీరోయిన్ శ్రద్ద కపూర్ కూడా యాక్షన్ లుక్ లోనే కనబడుతుంది. సాహో సినిమాకి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.