Advertisementt

ఈ సినిమాల టార్గెట్ క్రిస్టమస్..!!

Wed 24th Oct 2018 12:54 AM
padi padi leche manasu,anthariksham,yatra,ready to release,christmas  ఈ సినిమాల టార్గెట్ క్రిస్టమస్..!!
Movies List for Christmas Release ఈ సినిమాల టార్గెట్ క్రిస్టమస్..!!
Advertisement
Ads by CJ

దసరా వచ్చింది వెళ్ళింది. దసరాకి వచ్చిన మూడు సినిమాలు యావరేజ్ హిట్స్ తో సరిపెట్టుకున్నప్పటికీ.. దసరా సెలవలు వలన మూడు సినిమాలు ఒడ్డెక్కేశాయి. అరవింద సమేత వీర రాఘవ సినిమా కూడా రెండు వారాల కలెక్షన్స్ బావుండడంతో బ్రేక్ ఈవెన్ కి చేరుకునేలా కనబడడం, హలో గురు ప్రేమకోసమే, పందెం కోడి 2 సినిమాలు కూడా యావరేజ్ టాక్ తో పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చేసుకున్నాయి. ఇక దసరా తర్వాత మళ్ళీ సంక్రాంతే అంత పెద్ద పండగ. కానీ మధ్యలో డిసెంబర్ చివరి వారం అంటే క్రిష్టమస్ కూడా సినిమాల విడుదలకు మంచి టైమ్. క్రిస్టమస్ పండగ ముందురోజు క్రిస్టమస్ ఈవ్ ఒకరోజు సెలవు వస్తే.. 25 క్రిష్టమస్ రోజు సెలవు, అలాగే ఆ తర్వాతి రోజు బాక్సింగ్ డే సెలవుతో క్రిస్టమస్ పండగ సెలవలు కూడా సినిమాలకు బాగా ఉపయోగపడుతున్నాయి.

అందుకే దసరా తర్వాత నవంబర్ ని వదిలేసి డిసెంబర్ లో మళ్ళీ సినిమాల సందడి మొదలవుతుంది. ఇక ఈ డిసెంబర్ చివరిలో శర్వానంద్ - సాయి పల్లవిల కలయికలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడి పడి లేచె మనసు 21 న విడుదలకు సిద్ధమవుతుండగా... వ‌రుణ్‌తేజ్ – సంక‌ల్ప్‌రెడ్డి కాంబినేష‌న్ మూవీ అంత‌రిక్షం 9000 కెఎంపిహెచ్ మూవీతో పాటుగా... రాజకీయాలతో అత్యంత క్రేజీ మూవీగా తెరకెక్కుతున్న మ‌మ్ముట్టి -  మ‌హి వి రాఘవ్ కాంబినేష‌న్ మూవీ యాత్ర‌ కూడా డిసెంబర్ 21 న క్రిష్టమస్ సెలవల టార్గెట్ గానే బరిలోకి దిగుతున్నాయి.

ఇక ఈ మూడు సినిమాలు డిఫ‌రెంట్ కాన్సెప్టుల‌తో తెర‌కెక్కిన‌వే. శర్వానంద్ - సాయి పల్లవిల సినిమా పూర్తి స్థాయి రొమాంటిక్ ల‌వ్‌స్టోరి కాగా....  వ‌రుణ్ తేజ్ ఏకంగా టాలీవుడ్‌లో ఇదివ‌ర‌కెన్న‌డూ ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని క‌థాంశాన్ని ఎంచుకుని స్పేస్ బ్యాక్‌డ్రాప్ మూవీతో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇక మూడో సినిమా వైయ‌స్సార్ జీవిత‌ క‌థ‌తో తెర‌కెక్కుతున్న యాత్ర అంతే ప్ర‌త్యేక‌మైన చిత్రంగా పాపుల‌రైంది. ఈ మూడు వేటిక‌వే ప్ర‌త్యేకం కాబ‌ట్టి క్రిష్టమస్ బ‌రిలో కాంపిటీష‌న్ బాగా టఫ్ గా ఉంటుంద‌ని అందరూ భావిస్తున్నారు. మరి ఈ మూడు సినిమాలు కూడా క్రేజీ కాంబోలో కావడం... మూడు సినిమాలకు మంచి అంచనాలుండడం... ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉండడంతో.. ఈ క్రిష్టమస్ కూడా చాలా క్రేజీగా కనబడుతుంది. మరి మూడిట్లో క్రిస్టమస్ హీరో ఎవరవుతారో గానీ, ఇప్పటి నుండే ఈ సినిమాల హడావిడి మొదలెట్టేశాయి ఆయా చిత్ర బృందాలు. 

Movies List for Christmas Release:

Padi Padi leche manasu, anthariksham, Yatra Ready to Release on Christmas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ