Advertisementt

అర్జున్‌పై ఆరోపణలా! ‘మీటూ’ పక్కదోవ..!

Mon 22nd Oct 2018 06:40 PM
arjun,arjun sarja,action king,sony charishta,support  అర్జున్‌పై ఆరోపణలా! ‘మీటూ’ పక్కదోవ..!
Young Heroine Condemned Allegations on Arjun Sarja అర్జున్‌పై ఆరోపణలా! ‘మీటూ’ పక్కదోవ..!
Advertisement
Ads by CJ

‘మా పల్లెలో గోపాలుడు, మన్యంలో మొనగాడు, టెర్రర్, జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుని..  యాక్షన్ కింగ్‌గా పిలువబడే అర్జున్ సర్జా.. తనతో నటించే హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణని తాను ఎంతమాత్రం నమ్మలేకపోతున్నానని యువ కథానాయకి సోనీ చరిష్టా అన్నారు. ఈమేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ‘కాంట్రాక్ట్’ అనే చిత్రంలో ఆయనతో తాను కలిసి నటించానని, ఆయన అసలు సిసలు జెంటిల్మెన్ అని ఆమె పేర్కొన్నారు. ‘మీ టూ’ మెల్లగా పక్క దోవ పడుతోందని తాను  వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని సోని తెలిపారు. అర్జున్ సర్జా, సోనీ చరిష్టా నటించిన ‘కాంట్రాక్ట్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

Young Heroine Condemned Allegations on Arjun Sarja :

MeToo Allegations on Action King Arjun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ