Advertisementt

చరణ్‌ని చూస్తుంటే గర్వంగా ఉందట

Mon 22nd Oct 2018 02:27 PM
jagapathi babu,ram charan,sye raa movie,chiranjeevi  చరణ్‌ని చూస్తుంటే గర్వంగా ఉందట
Jagapathi Babu Praises Ram Charan చరణ్‌ని చూస్తుంటే గర్వంగా ఉందట
Advertisement
Ads by CJ

హీరోగా కెరియర్ ను స్టార్ట్ చేసి.. బోయపాటి 'లెజెండ్' సినిమాతో విలన్ పాత్రలు చేయడం స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారాడు జగపతి బాబు. తనదైన నటనతో ప్రేక్షకులని కట్టి పడేస్తున్నాడు జగ్గు. రీసెంట్ గా 'అరవింద సమేత' లో మ‌రోసారి త‌న న‌ట విన్యాసం చూపించాడు. తన కెరియర్ లో బ‌సిరెడ్డి పాత్ర‌ బెస్ట్ గా నిలిచిపోయేలా చేశాడు.

ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తున్న జగ్గూభాయ్ దృష్టి ఇప్పుడు ఇతర భాషా చిత్రాల‌పై ప‌డింది.తమిళ, కన్నడ చిత్రాలు కొన్ని ఒప్పుకున్న జగ్గూ రీసెంట్ గా ఓ బాలీవుడ్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు అంట. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'సైరా' లో కీలకపాత్రలో కనిపించనున్నాడు జగ్గూ.. దానికి సంబంధించి కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నాడు.

'సైరా' లో నేను చేసిన పాత్ర చాలా విభిన్న‌మైన‌ది. ఇందులో నా గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ పాత్ర‌ ఓ రకంగా నాకు ఛాలెంజ్‌. అయితే ఈ పాత్ర ఏంటనేది మాత్రం నేను ఇప్పుడే చెప్పను దానికి ఇంకా సమయం ఉంది. నటుడుగా రామ్ చరణ్ బిజీగా ఉంటూ ప్రొడ్యూసర్ గా నిర్మాణ బాధ్య‌త‌ల్ని నెత్తిమీద పెట్టుకున్నాడు.

చరణ్ ని చూస్తుంటే నాకు గర్వంగా.. ఆనందంగా ఉందని చరణ్ కు కితాబిచ్చాడు జ‌గ్గూభాయ్‌. నిజానికి జగపతిబాబు చిరంజీవి 'ఖైదీ నెం.150’లో నటించాల్సి ఉంది.. కానీ కొన్ని కారణాల వల్ల అది వర్క్ అవుట్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కరెక్ట్ గా సెట్ అయింది. మరి అతని పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలి.

Jagapathi Babu Praises Ram Charan:

Jagapathi babu happy with Ram charan Duties

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ