Advertisementt

‘మీటూ’ ఆరోపణలపై యంగ్‌ స్టార్ కౌంటర్‌!

Sun 21st Oct 2018 03:56 PM
sushant singh rajput,denied,allegations,metoo  ‘మీటూ’ ఆరోపణలపై యంగ్‌ స్టార్ కౌంటర్‌!
Young Hero reacts to sexual harassment allegations ‘మీటూ’ ఆరోపణలపై యంగ్‌ స్టార్ కౌంటర్‌!
Advertisement
Ads by CJ

‘మీటూ’ ఉద్యమంతో భారతీయ సినీ పరిశ్రమ అట్టుడుకుతోంది. హీరోలు, దర్శకనిర్మాతలు, సంగీత దర్శకులు, సింగర్స్‌ కూడా ఈ లిస్ట్‌లోకి చేరిపోతున్నారు. నానా పాటేకర్‌ నుంచి యంగ్‌స్టార్‌ సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ వరకు ఈ కోవకి చెందిన వారే. ఇక త్వరలో బిగ్‌బి అమితాబ్‌ రహస్యాలను కూడా బయటపెడతానని హెయిర్‌స్టైలిష్‌ హెచ్చరించింది. ఇక ఈ ఎంఎస్‌ధోని హీరో సుశాంత్‌పై ఆయనతో కలసి నటించిన సంజన అనే యువతి తాజాగా ఫిర్యాదు చేసింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించిన ‘కిజీ ఔర్‌ మ్యానీ’ చిత్రం షూటింగ్‌లో తన పట్ల సుశాంత్‌ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. 

నటునిగానే కాదు.. బయట జీవితంలో కూడా సుశాంత్‌కి మంచి వాడనే పేరుంది. వివాదాలకు ఆయన దూరంగా ఉంటూ ఉంటారు. దీంతో ఈ ఆరోపణలపై సుశాంత్‌ వెంటనే స్పందించాడు. అసలు ఆ సినిమా సెట్‌లో ఏమి జరిగిందో? తమ మద్య ఫోన్‌ సంభాషణ ఏమి జరిగిందో ఆయన వివరించాడు. తనకు, సంజనకు మధ్య జరిగిన చాటింగ్‌ గురించిన వివరాలను ఆయన స్క్రీన్‌షాట్‌లో తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఆయన ఇంకా వివరణ ఇస్తూ, కొందరు కావాలని చేస్తోన్న ఆరోపణలను, నిందలను నిజం కాదని చెప్పడానికి నాకు నేనుగా స్పందించకుండా ఉండలేకపోతున్నాను. అందుకే నన్ను నేను మద్దతు ఇచ్చుకుంటున్నాను. 

కొందరు మీటూ ఉద్యమాన్ని తమ సొంత ప్రయోజనాలకు, తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. మా మద్య జరిగిన సంభాషణ, ఇతర అన్ని విషయాలను మీముందు నేను ఆధారాలతో సహా ఇచ్చాను. ఇక దీనిని తేల్చాసింది? దీనిపై స్పందించాల్సింది మీరే..! ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సింది మీరే. ఒకరి వ్యక్తిగత విషయాలని ఇలా అందరితో పంచుకోవడం తప్పు అని నాకు తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు వేరేమార్గం కనిపించడం లేదని ఉద్వేగంతో చెప్పారు. ఇందులో సుశాంత్‌దే నిజం అనిపిస్తోంది. మరి దీనిపై సంజన ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Young Hero reacts to sexual harassment allegations:

Sushant Singh Rajput has denied sexual misconduct allegations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ