Advertisementt

నందమూరి ఫ్యాన్స్‌కి ఆరోజు వచ్చేసింది

Sun 21st Oct 2018 03:31 PM
balakrishna,ntr,aravinda sametha,success event,chief guest  నందమూరి ఫ్యాన్స్‌కి ఆరోజు వచ్చేసింది
Balakrishna Chief Guest for Aravinda Sametha Success Event నందమూరి ఫ్యాన్స్‌కి ఆరోజు వచ్చేసింది
Advertisement
Ads by CJ

యంగ్ టీజర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన అరవింద సమేత - వీర రాఘవ భారీ అంచనాల నడుమ దసరా కానుకగా ఈ నెల 11న విడుదలైంది. సినిమాకి మొదట్లో తేడా టాకొచ్చినా... చివరికి సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ అయ్యింది. అయితే అరవింద సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయినప్పటికీ... ఎన్టీఆర్ ఆత్మస్థైర్యంతో షూటింగ్ కంప్లీట్ చేసి మరీ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేశాడు. ఇక హరికృష్ణ చనిపోయిన టైంలోనే నందమూరి ఫ్యామిలీ బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని దగ్గరికి తియ్యడంతో ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి దగ్గరైయ్యారనే భావన అందరిలో కలగడం.. అరవింద సమేత ప్రమోషన్స్ లో బాలకృష్ణ పాలుపంచుకుంటాడనే ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ తో బిజీగా ఉండి అరవింద ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయాడు.

ఇక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలిసి అరవింద సమేత ప్రమోషన్స్ ని చేశారు. అలాగే సినిమా విడుదలయ్యాక కూడా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ లు కలిసి సినిమాని ప్రమోట్ చేస్తూ పోయారు. సక్సెస్ మీట్ అంటూ హడావిడి చేశారు. ఇక అరవింద సమేత కలెక్షన్స్ పరంగా బాగుండడంతో.. అరవింద సమేత విజయోత్సవ సభని అక్టోబర్ 21న అనగా రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నామని అరవింద నిర్మాతలు హారిక అండ్ హాసిని వారు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విజయోత్సవ వేడుకకి ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ హాజరవుతున్నాడని  ఎన్టీఆర్ పర్సనల్ పీఆర్వో మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

ఇక ఒకే వేదిక మీద ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ లను చూసే నందమూరి అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలుండవంటే నమ్మాలి. ఇక ఈ వేడుకలో హీరోయిన్స్ పూజాహెగ్డే, ఈషా రెబ్బాతోపాటుగా జగపతి బాబు, త్రివిక్రమ్ కూడా హాజరవుతారని చెబుతున్నారు. మరి అరవింద సమేత హిట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే పండగ చేసుకుంటుంటే ఇప్పుడు అరవింద విజయోత్సవ సభకి బాలకృష్ణ రావడంతో ఆ పండగ మరింత వెలుగు జిమ్ముతుంది.

Balakrishna Chief Guest for Aravinda Sametha Success Event:

Balakrishna & NTR on Same Dais  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ