మణిరత్నం, శంకర్ వంటి వారి తరహాలోనే మురుగదాస్ కూడా గ్రేట్ డైరెక్టర్ అని అందరు మెచ్చుకుంటారు. ముఖ్యంగా శంకర్‌లాగా సోషల్‌మెసేజ్‌ని కూడా తనదైన కమర్షియల్ కోటింగ్ ఇవ్వడంలో ఈయన కూడా దిట్ట. ఇక ఈయన కెరీర్‌లో ఎంతో మంచి చిత్రమైన ‘సెవెన్త్‌సెన్స్’, మహేష్‌బాబు ‘స్పైడర్’ చిత్రాలు బాగా ఆడని చిత్రాలుగా నిలిచాయి. మరీ ముఖ్యంగా తెలుగువారికి మురుగదాస్ మీద ఎంతో నమ్మకం ఉన్నా, ఆయన చిత్రాలు ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్స్ అవుతాయనే గట్టి నమ్మకాలు మాత్రం లేదు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ ఆయనంటే పడిచస్తారు. అందునా ఆయన దళపతి విజయ్‌తో తీసిన ‘తుపాకి, కత్తి’ వంటి రెండు చిత్రాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన విజయ్‌తో హ్యాట్రిక్ చిత్రంగా ‘సర్కార్’ చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది.
1.33 సెకన్ల ఈ టీజర్‌లో విజయ్ ఎన్నారై బిజినెస్‌మేన్‌గా కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్‌లో.. ఆయన ఓ కార్పొరేట్ రాక్షసుడు. ఏ దేశానికి వెళ్లినా కాంపిటీషన్‌ని స్మాష్ చేసి గానీ వదలిపెట్టడు. ఆయన ఇప్పుడు ఇండియా వచ్చాడు.. అనే అర్ధం ఉన్న తమిళ డైలాగ్స్ వినిపించాయి. ఇక మీడియాతో తాను ఏకంపెనీని టేకోవర్ చేయడానికి రాలేదని, కేవలం ఓటు వేసేందుకే వచ్చానని సమాధానం ఇస్తాడు. కానీ తాను వేయాల్సిన ఓటు మరొకరు దొంగతనంగా వేయడంతో అప్‌సెట్ అయిన విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు. ఇలా ఈ చిత్రం టీజర్ ద్వారా చాలా విషయాలు అర్ధమవుతాయి. ఈ చిత్రం పూర్తిగా విజయ్, మురుగదాస్‌ల టూమేన్ షో అనే చెప్పాలి. విజయ్‌లుక్స్, ఫైట్స్, డైలాగ్స్, డ్యాన్స్‌లు, ఆయన స్టైలింగ్ అదిరిపోయింది.
ఇక ఈయన చూయింగ్‌గమ్‌ని రజనీ తరహాలో నోట్లో వేసుకునే సీన్ అద్బుతం. ఆ సీన్‌లో మరో రజనీ కనిపిస్తాడు. కీర్తిసురేష్‌కి టీజర్‌లో పెద్ద ఇంపార్టెన్స్ లేదు. విజయ్ మాస్ ఇమేజ్‌కి పొలిటికల్ ఇష్యూలని కలిపి ఈ చిత్రాన్నిమురుగదాస్ రూపొందించాడనంలో సందేహం లేదు. మొత్తానికి మంచి మాస్ మసాలా దట్టించిన చిత్రంగా ‘సర్కార్’ ఉండనుందనే చెప్పాలి. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్6వ తేదీన విడుదల కానుంది.