తమిళనాట లింగుస్వామి దర్శకత్వంలో విశాల్ - కీర్తి సురేష్ జంటగా వరలక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సండకోళి 2’ టైటిల్ తో తమిళనాట విడుదలకాగా, తెలుగులో ‘పందెం కోడి 2’ గా విడుదలైంది. తమిళనాట సండకోళి 2 కి హిట్ టాక్ రాగా.. తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా దసరా కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ మాస్ నటన తో ఈ సినిమాలో ఆకట్టుకోగా... కీర్తి సురేష్ పాత్రకి సో సో టాక్ రాగా.. మరో పవర్ ఫుల్ పాత్రలో నటించిన వరలక్ష్మి పాత్రకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక కథ, కథనం, లింగుస్వామి దర్శకత్వం కూడా యావరేజ్ గా ఉండగా.. ఈ సినిమా 13 ఏళ్ళ క్రితం వచ్చిన పందెం కోడి సినిమాకి సీక్వెల్ అయినప్పటికీ... పందెం కోడి సినిమా అంత పవర్ ఫుల్ గా లేదంటున్నారు. అప్పట్లో పందెం కోడి సూపర్ హిట్ అయ్యింది. ఇక పందెం కోడి 2 కి యావరేజ్ టాకొచ్చినా విశాల్ నటనతో ఈ సినిమా మొదటిరోజు విశాల్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. కేవలం తమిళనాడు లోనే సండకోళి 2 చిత్రం 5.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి..... విశాల్ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించుకుంది. రాయలసీమలోని రెండుకుటుంబాల మధ్య రాజుకున్న పగ.. అంటే రూరల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు.
కేవలం మొదటి రోజే కాదు.. విశాల్ పందెం కోడి 2 నిన్న శుక్రవారం కూడా తమిళనాట మంచి వసూళ్ళని సాధించిందంటున్నారు. ఇక తెలుగులోనూ రామ్ హీరోగా వచ్చన హలో గురు ప్రేమ కోసమే చిత్రానికి కూడా యావరేజ్ టాక్ రావడంతో.. పందెం కోడి 2 కి తెలుగులోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటున్నారు. మరి డిటెక్టివ్, అభిమన్యుడు హిట్స్ తో ఇరగదీసిన విశాల్ ఇప్పుడు పందెం కోడి 2 తో కూడా హిట్ ట్రాక్లో దూసుకుపోతున్నాడు.