సినిమా రంగంలో నటీమణులకు వేధింపులు సహజమేనని ఒప్పుకోవాల్సిందే. కానీ కొందరు తమ టాలెంట్, అందచందాలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న వారు ఇలాంటి వాటికి తలాడించరు. తమ మీద ఉన్న నమ్మకంతో అలాంటి దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఎంత గొప్పవారైనాకూడా నో చెబుతారు. దానివల్ల అవకాశాలు తగ్గినా బాధపడరు. తమకి నచ్చిన వారితో, నచ్చిన పాత్రలు, సినిమాలలో మాత్రమే చేస్తారు. అయితే ఇలాంటి వేధింపులు కేవలం ఎలాంటి బ్యాగ్రౌండ్, అండదండలు లేకుండా ఫీల్డ్‌కి వచ్చే వారికి అధికంగా ఉంటాయి. అయితే వారసురాళ్లుగా వచ్చిన వారి విషయంలో ఇలాంటి వేధింపులు తక్కువేనని చెప్పాలి. అయినా వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు పలువురు వారసులు కూడా ఇలాంటి వేధింపులకు గురయ్యామని చెబుతున్నారు.
ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో అత్యంత కోపిష్టిగా, కోపం వస్తే ఏం చేస్తాడో కూడా తెలియని వ్యక్తిగా కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకి పేరుంది. ఈయన ఏకైక కుమార్తె మంచు లక్ష్మి కూడా ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా, హోస్ట్‌గా తన బహుముఖ ప్రజ్ఞను చాటుతోంది. ఇక తాజాగా ఈమె కూడా మీటూ ఉద్యమం, సినీ రంగంలో నటీమణులకు ఎదురయ్యే లైంగికవేధింపులపై స్పందించింది.
ఆమె మాట్లాడుతూ, నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని సంచలన విషయన్ని బయటపెట్టింది. అయితే సినిమా రంగంలో నేను వేధింపులు ఎదుర్కోలేదు. కానీ నిజజీవితంలో మాత్రం ఎదురుకున్నాను. ఇక పవన్‌కళ్యాణ్ గారిని నేను నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమానికి ఆహ్వానించాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. కార్యక్రమానికి రావాలని ఆయనను ఎప్పటి నుండో అడుగుతూ వస్తున్నాను. ఇంకా ఆయన నుంచి సమాధానం రాలేదని తెలిపింది.