వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలుగా మహేష్ హీరోగా ‘మహర్షి’ మూవీ షూటింగ్ ఒక రేంజ్ లో గ్యాప్ లేకుండా జరుగుతుంది. హైదరాబాద్, డెహ్రాడూన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహర్షి టీం తదుపరి షెడ్యూల్ కోసం అమెరికా ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా దర్శకుడు వంశీ పైడిపల్లి అమెరికాలోని పలు అరుదైన లొకేషన్స్ ని సెట్ చేసాడు. అయితే అనుకున్న టైం కి మహేష్ మహర్షి టీం కి అమెరికా షెడ్యూల్ ఫైనల్ కాలేదు. వీసా ప్రోబ్లెంస్ తో మహర్షి టీం అమెరికాకి వెళ్లలేకపోయింది.
అయితే తాజాగా మహర్షి టీం వీసా ప్రాబ్లమ్స్‌ని అధిగమించి తాజాగా అమెరికా బయలుదేరింది. అమెరికా షెడ్యూల్‌లో దాదాపుగా 20 రోజులపాటు విరామం లేకుండా చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. గురువారమే న్యూయార్క్‌లో ‘మహర్షి’ షూటింగ్ మొదలయ్యింది. అయితే ఈ సినిమాలో అమెరికా షెడ్యూల్ చాలా కీలకం కాబట్టే.. అక్కడ షూటింగ్ కోసం వంశీ పైడిపల్లి అంత పట్టుబట్టాడు. ఇక మహర్షి టీం అంటే మహేష్‌తో పాటుగా మహేష్ కొడుకు కూడా తండ్రితో పాటుగా అమెరికా వెళ్ళాడు.
మహేష్ అండ్ మహర్షి టీం తో గౌతమ్ కృష్ణ కలిసి అమెరికా వెళుతున్న ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇకపోతే మహర్షి సినిమాపై ఉన్న క్రేజ్ తో మహర్షి శాటిలైట్ హక్కులను జెమిని ఛానల్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్టుగా ఇప్పటికే వార్తలొచ్చాయి.