Advertisementt

ఇప్పుడు కీర్తిసురేష్ పరిస్థితి ఏంటి?

Fri 19th Oct 2018 10:44 PM
keerthi suresh,vishal,pandem kodi 2,movie,released  ఇప్పుడు కీర్తిసురేష్ పరిస్థితి ఏంటి?
keerthi Suresh acted Pandem Kodi 2 Movie Released ఇప్పుడు కీర్తిసురేష్ పరిస్థితి ఏంటి?
Advertisement
Ads by CJ

మహానటితో కీర్తి గడించిన కీర్తి సురేష్ కి ప్రస్తుతం అస్సలు కలిసిరావడం లేదు. బరువు పెరగడంతో.. కీర్తి సురేష్ క్రేజ్ డౌన్ అవుతుంది. ఇప్పటికే తమిళనాట విక్రమ్ తో నటించిన సామి స్క్వేర్ డిజాస్టర్ అవడంతో కీర్తి సురేష్ ఆశలన్నీ విశాల్ తో నటించిన పందెంకోడి 2 మీదే ఉన్నాయి. నిన్న గురువారం ప్రపంచవ్యాప్తంగా పందెంకోడి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తమిళనాట పందెంకోడి 2 టాక్ సంగతి పక్కన పెట్టి తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకుల నుండి, క్రిటిక్స్ నుండి విశాల్ పాస్ మార్కులైతే వేయించుకున్నాడు కానీ... హిట్ టాక్ తెచ్చుకోలేయకపోయాడు. అయితే ఈ సినిమాతో అయినా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకున్న కీర్తి సురేష్ కి ఈ సినిమా ఎంతవరకు మేలు చేసిందో చూద్దాం.

ఈ సినిమాలో కీర్తి సురేష్.. పందెంకోడిలో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్ పాత్రకు కొనసాగింపులా అనిపించే క్యారెక్టర్లో నటించింది. తన కొడుకు ప్రేమించిన అమ్మాయి ఎవరా అని హీరో తండ్రి చూస్తుండగా.. హీరోయిన్ స్కూటర్ నడుపుతూ దాన్ని గాల్లోకి లేపి సెల్ఫీ దిగుతుంది. ఇంకోచోట హీరోతో కలిసి జీపులో వెళ్తూ వెళ్తూ తను దిగాల్సిన చోట మర్రి ఊడల్ని పట్టుకుని ఎగిరి కిందికి దూకుతుంది. హీరోయిన్ని ఇలాంటి అల్లరి పాత్రలో చూడటం కూడా కొత్తగా అనిపిస్తుంది. అల్లరి అమ్మాయి అయిన చారుమతి పాత్రలో పర్వాలేదనిపించింది. కాకపోతే ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో కీర్తిని చూడ‌డం క‌ష్ట‌మేమో. చాలా మాసీగా క‌నిపించింది. మ‌హాన‌టిలో చూసిన కీర్తినేనా మనం చూస్తున్నది అన్న‌ట్టుంది. ఈసారీ త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం సంతోషించ‌ద‌గిన విషయం.

కాకపోతే పందెం కోడి 2 సూపర్ హిట్ అయితే కీర్తి సురేష్ పాత్రకి కొద్దిగా పేరొచ్చేది. కానీ సినిమాకి మిక్స్డ్ టాక్ పడడంతో కీర్తి సురేష్ కి కూడా సో సో టాకే వస్తుంది. మరి సామి స్క్వేర్ ప్లాప్ తో ఉన్న కీర్తికి పందెంకోడితో కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంటే... విజయ్ తో కలిసి మురుగదాస్ డైరెక్షన్ లో నటించిన సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.

keerthi Suresh acted Pandem Kodi 2 Movie Released:

Mixed Talk to Vishal and keerthi Suresh Pandem Kodi 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ