Advertisementt

మహేష్‌పై మళ్లీ ప్రయోగమా సుక్కు..?

Fri 19th Oct 2018 04:58 PM
mahesh babu,sukumar,maharshi movie,telangana warrior  మహేష్‌పై మళ్లీ ప్రయోగమా సుక్కు..?
Mahesh Babu, Sukumar Film Details మహేష్‌పై మళ్లీ ప్రయోగమా సుక్కు..?
Advertisement
Ads by CJ

మహేష్ - సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా 'మహర్షి' తర్వాత తెరకెక్కనుంది. అయితే సుకుమార్ ఈ సినిమాలో మహేష్ లుక్ విషయంలో సంచనల నిర్ణయం తీసుకున్నాడు. మహేష్ ను ఇప్పటి వరకు ఎవరు సరైన మాస్ క్యారక్టర్ లో చూడలేదు. అలానే పోరాట యోధుడిగా కూడా చూడలేదు. అయితే సుకుమార్ మాత్రం ఇప్పటి వరకు మహేష్ ను ఎవరు చూపించని విధంగా చూపించబోతున్నాడు.

గత కొన్ని రోజులు నుండి డైరెక్టర్ సుకుమార్ మహేష్ ను ఎలా చూపిద్దాం అనుకున్న టైములో ఆయనకు ఎవరో తెలంగాణ సాయుధ పోరాటం గురించి చెప్పారంట. దానికి సంబంధించి సుక్కు చదువుతున్నారు. అచ్చం అలా తీయకపోయినా దాని స్ఫూర్తితో ఒక కల్పిత కథను తయారు చేసి  మహేష్ తో తీద్దాం అని అనుకుంటున్నాడట. మరి మహేష్ సాయుధ పోరాటం చేస్తాడా? అంటే వినటానికి కొత్తగా ఉండొచ్చు.

కానీ సుకుమార్ ఎట్టి పరిస్థితుల్లో మహేష్ తో అటువంటి సినిమానే తీయాలని డిసైడ్ అయ్యారట. 'రంగస్థలం' సినిమాలో చెర్రీ లుక్ ను పూర్తిగా మార్చేసిన ఘనత సుకుమార్ దే. అలానే మహేష్ లుక్ తో పాటు తన మాక్ ఓవర్ ని సరిగ్గా డీల్ చేస్తే ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్ వస్తుందని భావిస్తున్నాడట. మరి మహేష్ ని 'రా' లుక్ లో చూడడం ఫ్యాన్స్ ఇష్టపడతారా? అంటే చూడాలి ఏముంతుందో మరి.

Mahesh Babu, Sukumar Film Details:

Mahesh Babu Is Telangana Warrior  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ