Advertisementt

తండ్రి చనిపోయి ఉంటే కామెడీనా: ఎన్టీఆర్

Fri 19th Oct 2018 12:07 AM
jr ntr,trivikram srinivas,aravinda sametha,comedy,young tiger ntr  తండ్రి చనిపోయి ఉంటే కామెడీనా: ఎన్టీఆర్
Jr NTR and Trivikram Srinivas About Comedy in Aravinda Sametha తండ్రి చనిపోయి ఉంటే కామెడీనా: ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

మొదటిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా హిట్ అయింది. మొదట్లో ఈ సినిమాపై కాస్త మిక్స్డ్ టాకొచ్చినా... చివరికి సినిమా కలెక్షన్స్ అదిరిపోవడంతో.. ఆటోమాటిక్ గా అరవింద సమేత సినిమా హిట్ అయ్యి కలెక్షన్లు కుమ్మేస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. సినిమా మొత్తం ఎన్టీఆర్ సింగిల్ షోతో నడిచింది. ఎన్టీఆర్ స్ర్కీన్ మొత్తం ఆక్రమించి సినిమా మొత్తంగా అదరగొట్టాడు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మాస్ నటనతో ఇరగదియ్యడంతో ఈ సినిమాని డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ మార్క్ కామెడీ మిస్ అయ్యిందనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కనబడింది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమాలో మాకు త్రివిక్రమ్ కనబడలేదు..కేవలం ఎన్టీఆర్ మాత్రమే కనిపించాడంటున్నారు. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ కామెడీపై ఈ సినిమాలో నీలాంబరిగా నటించిన సునీల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద సమేతలో కామెడీ మిస్ అవడంపై ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ లు క్లారిటీ ఇచ్చేసారు.

సినిమా కథలో భాగంగా హీరో ప్రత్యర్థుల విషయంలో ఒక సొల్యూషన్ కి ప్రయత్నించేటప్పుడు అందులో కామెడీ పెడితే ఎలా ఉంటుందనే దానికి ఎన్టీఆర్ ఏం చెప్పాడో తెలుసా... వీరరాఘవుడి తండ్రి చనిపోయాడు. హీరో ఒక సొల్యూషన్ వెతుక్కోవడానికి వెళుతున్నాడు. అలాంటి టైం లో కామెడీ చేస్తే బాగుంటుందా.... ఈ సినిమాలో కాస్త కామెడీ చేసిన సీనియర్ నరేష్ గారు .. ఆకు బ్యాచ్ .. హీరోయిన్ పూజ హెగ్డే కామెడీ చేశారుగా..... మాములుగా త్రివిక్రమ్ గారు ఒక్కోసారి ఒక్కో కథ రాస్తారు. కానీ ఆయన ప్రతిసారి కామెడీ కథనే రాయాలని ఏముంది.... అంటూ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. 

ఇక త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఈ కథకి కామెడీ వలన రసభంగం జరుగుతుందని అనిపించింది. సెకండాఫ్ లో పాట పెట్టడానికి కూడా భయపడిపోయాం. కానీ కామెడీ లేకపోతే ఎలాగా... అని భయపడలేదు. కామెడీ ఈ కథలో కూర్చోవడం లేదు. కథను పాడు చేయడం ఇష్టంలేకనే కామెడీని ఇరికించే ప్రయత్నం చేయలేదు.. అంటూ అరవింద సమేత - వీర రాఘవ సినిమా కథలో కామెడీ మిస్సింగ్ పై హీరో అండ్ డైరెక్టర్స్ క్లారిటీ ఇచ్చేసారు. 

Jr NTR and Trivikram Srinivas About Comedy in Aravinda Sametha:

Jr NTR and Trivikram Srinivas Latest Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ