Advertisementt

రామ్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు..!!

Thu 18th Oct 2018 11:58 PM
ram hero,hello guru prema kosame,dil raju,promotions,hero ram  రామ్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు..!!
Ram Unhappy with Dil Raju Stand on HGPK రామ్ ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు..!!
Advertisement
Ads by CJ

ఈ రోజు గురువారం దసరా పండగ సందర్భంగా రామ్ పోతినేని - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు బ్యానర్ లో కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈమధ్యన ప్లాప్ హీరోలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన దిల్ రాజు... తాజాగా రామ్ తోనూ సినిమా చేసాడు. రాజ్ తరుణ్, నితిన్ వంటి హీరోలకు హిట్ ఇద్దామనే సినిమాలు చేశానని బహిరంగంగా చెప్పిన దిల్ రాజు.. రామ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకంటే రామ్ గత చిత్రాలు కూడా ప్లాప్ అవడంతో దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తే హిట్ ట్రాక్ ఎక్కుతాననుకుంటున్నాడు. ఎందుకంటే చాలామంది యంగ్ హీరోలకు దిల్ రాజు బ్యానర్ లో సినిమా చెయ్యడం అంటే వాళ్ళకి భరోసా ఉంటుంది.

దిల్ రాజు కథల ఎంపిక,  సినిమాపై ఉన్న పట్టు, సినిమాల పబ్లిసిటీ కార్యక్రమాల్లో కొత్త ఒరవడి ఉండడంతో దిల్ రాజు తో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు ఉత్సాహం చూపుతుంటారు.  అందుకే దిల్ రాజుతో సినిమాలు చెయ్యడానికి వారు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే రామ్ కూడా దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసి హిట్ కొట్టాలనుకున్నాడు. కానీ ఇప్పుడు దిల్ రాజు విషయంలో రామ్ అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ వినబడుతుంది. ఈ సినిమా విష‌యంపై, దిల్‌రాజు ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ విష‌యంలోనూ రామ్ అసంతృప్తిగా ఉన్నాడ‌ని టాక్‌. దసరా పండగ రోజు సినిమాని విడుదల చేసి హిట్ కొట్టాలనుకున్నాడు రామ్. అందుకు తగ్గ ప్రమోషన్స్ ని చేసాడు. మరి తమిళ పందెం కోడి తో పోటీ పడడం ఒక ఎత్తైతే.... ఇక్కడ గత వారం విడుదలైన అరవింద సమేత హడావిడి ఇంకా ముగియలేదు. మరి ఆ రెండు సినిమాలను తప్పించి ప్రేక్షకుడిని తన వైపు తిప్పుకునే కెపాసిటీ రామ్ కి ఉందా...?

అందులోను రామ్ గత చిత్రం ఉన్నది ఒకటే జిందగీ ప్లాప్ అవడం వలన ఇప్పుడు విడుదలవుతున్న హలో గురు ప్రేమకోసమే చిత్ర ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చెయ్యాల్సి ఉంది. అయితే తన గత చిత్రాలకు తన పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో పక్కా ప్లానింగ్ తో చేసేవారు. దానిద్వారానే రామ్ తనకు నచ్చిన పద్దతిలో ప్రమోషన్ చేపట్టేవాడు. కానీ ఇప్పుడు స్రవంతి ద్వారా రామ్ ఏం చెయ్యలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా విషయాలన్నీ దిల్ రాజు స్వయంగా చూడడంతో రామ్ ప్లానింగ్స్ ఏం వర్కౌట్ అవ్వకపోవడంతో.. రామ్ కాస్త చిరాకుగా ఉన్నట్లుగా.... సినిమాకి ప్రేక్షకుల్లో రావాల్సిన క్రేజ్ లేకపోవడంతో రామ్ కాస్త అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో స్ప్రెడ్ అయ్యింది.

Ram Unhappy with Dil Raju Stand on HGPK:

Ram Disappointed with HGPK Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ