Advertisementt

రామ్‌ బిజినెస్‌ స్థాయికి ఆ చిత్రం వీలుకాదా?

Thu 18th Oct 2018 10:08 PM
hero ram,hello guru prema kosame,youth film,praveen sattaru,trinadharao nakkina,ready to release  రామ్‌ బిజినెస్‌ స్థాయికి ఆ చిత్రం వీలుకాదా?
Hero Ram Talks About Praveen Sattaru Film రామ్‌ బిజినెస్‌ స్థాయికి ఆ చిత్రం వీలుకాదా?
Advertisement
Ads by CJ

నేడు ఎందరో యంగ్‌హీరోలు తమ స్టామినా, బిజినెస్‌ రేంజ్‌ ఎంత అనే విషయాలను పక్కనపెట్టి మరీ భారీ బడ్జెట్‌ చిత్రాలలో నటించే ఆఫర్స్‌ వస్తే నటించడానికి బాగా ఇంట్రస్ట్‌ చూపుతున్నారు. ఎందుకంటే బడ్జెట్‌ పెట్టేది నిర్మాతే కాబట్టి తమకేం ఇబ్బంది ఉండదనేది వారి ధీమా కావచ్చు. కానీ హీరో రామ్‌ మాత్రం తన బిజినెస్‌ రేంజ్‌ని బాగా తెలుసుకుని మరీ సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ఇక విషయానికి వస్తే ఇటీవల ప్రవీణ్‌సత్తార్‌ దర్శకత్వంలో హీరో రాజశేఖర్‌తో 'పీఎస్వీ గరుడ వేగ' వచ్చింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీకి ప్రశంసలతో పాటు మంచి టాక్‌ వచ్చింది. కానీ రాజశేఖర్‌కి అంత బిజినెస్‌ వర్కౌట్‌ కాదనే అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఆ మూవీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఆతర్వాత రామ్‌, ప్రవీణ్‌సత్తార్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. 

ఈ విషయంపై హీరో రామ్‌ స్పందిస్తూ, నిజమే.. ప్రవీణ్‌సత్తార్‌తో కలసి ఓ చిత్రం చేయాలని భావించాను. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలుపెట్టాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఆ సినిమాకి భారీ బడ్జెట్‌ అవుతుంది. అందువల్ల ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. భవిష్యత్తులో ప్రవీణ్‌సత్తార్‌తో కలసి ఓ చిత్రం తప్పకుండా చేస్తానని తెలిపాడు. ఇక తాజాగా విడుదలైన త్రినాధరావు నక్కిన హ్యాట్రిక్‌ ఫిల్మ్‌గా దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన 'హలో గురు ప్రేమకోసమే' చిత్రం గురించి రామ్‌ మాట్లాడుతూ, ఈ సినిమా తప్పకుండా యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతుంది. ఈ రొమాంటిక్‌ యూత్‌ అండ్‌ లవ్‌స్టోరీలో యూత్‌ ఆశించే ఫీల్‌ ఉంటుంది. ఒక ప్రేమ జంటతో కలిసి యూత్‌ అంతా జర్నీ చేసే విధంగా ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాలో నేను విలేజీ నుంచి సిటీకి వచ్చే కుర్రాడిలా, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కనిపిస్తాను. దర్శకుడు త్రినాథరావు నక్కి, రచయిత ప్రసన్నకుమార్‌లు నా పాత్రను అద్భుతంగా మలిచారు. 

ఇప్పటి వరకు నేను చాలా పాత్రలు చేశాను. నాకిష్టమైన పాత్ర ఏది అని అడిగితే మాత్రం 'హలో గురు ప్రేమకోసమే' చిత్రంలోని పాత్రేనని చెబుతాను. ఆ పాత్రను చేస్తున్నప్పుడు ఎంతో ఎంజాయ్‌ చేశాను. నాపాత్ర, ప్రకాష్‌రాజ్‌ పాత్ర, అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇంతవరకు ఎవ్వరూ టచ్‌ చేయని పాత్రలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తూ ఉండటం వల్ల తప్పకుండా సక్సెస్‌ లభిస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. 

Hero Ram Talks About Praveen Sattaru Film:

Hero Ram Latest Interview updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ