Advertisementt

ప్రభాస్.. బాహుబలితో జర జాగ్రత్త..!!

Thu 18th Oct 2018 03:14 PM
prabhas,rajamouli,direction,next movie  ప్రభాస్.. బాహుబలితో జర జాగ్రత్త..!!
SS Rajamouli movies Sentiment to Prabhas ప్రభాస్.. బాహుబలితో జర జాగ్రత్త..!!
Advertisement
Ads by CJ

'బాహుబలి' లాంటి సెన్సేషన్ హిట్ తర్వాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ సుజీత్ తో 'సాహూ' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో అంతగా అంచనాలు ఏమి కనిపించడం లేదు. 'బాహుబలి' కి వచ్చిన ఇండియా వైడ్ మార్కెట్ తో ప్రభాస్ ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలి. కానీ ఒక్క సినిమానే తీసిన కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇది ఒక రకంగా ప్రయోగమనే చెప్పాలి.

నెక్స్ట్ సినిమా విషయంలో కూడా ప్రభాస్ అదే తప్పు చేస్తున్నాడు. 'జిల్' తో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నాడు. రీసెంట్ గా దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. 'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ పెరిగింది. అగ్ర దర్శకులతో సినిమాలు చేయాల్సింది పోయి ప్రయోగాలు చేస్తున్నాడు. ఒకవేళ అవి ఏమన్నా తేడా కొడితే రాజమౌళి సెంటిమెంట్ ని నిజం చేసిన వాడు అవుతాడని ఫ్యాన్స్ భయపడుతున్నారు. 

అసలు ఈ రాజమౌళి సెంటిమెంట్ ఏంటి అనుకుంటున్నారా..రాజమౌళితో ఏ హీరో అయినా సినిమా చేస్తే ఆ తర్వాత ఆ హీరోకి సక్సెస్ రావాలంటే చాలా కాలం పడుతుంది. 'ఛత్రపతి' సినిమా తర్వాత కూడా ప్రభాస్ కు హిట్ రావడానికి చాలా టైం పట్టింది. అలా చూసుకుంటే ప్రభాస్ పెద్ద రిస్కే చేస్తున్నాడు అని కొందరంటున్నారు. మరి ఎందుకు ఇలా కొత్త డైరెక్టర్స్ తో ముందుకు వెళ్తున్నాడో ప్రభాస్ కే తెలియాలి.

SS Rajamouli movies Sentiment to Prabhas:

Rumours Started on Prabhas next Movies 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ